‘నమస్తే’తో మనసులు గెలుచుకున్న రాజ్‌నాథ్‌

3 Sep, 2020 16:00 IST|Sakshi

మాస్కో: ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ సంస్కృతిలో భాగమైన ‘నమస్తే’ పదం బాగా ప్రాచుర్యం పొందింది. కరోనా నుంచి తప్పించుకోవడానికి షేక్‌హ్యాండ్‌ బదులు చేతులతో నమస్కారం చేయడం శ్రేయస్కరమని పాశ్చాత్య దేశాలు గ్రహిస్తున్నాయి. కాగా ప్రస్తుతం భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యాలో జరగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కీలక సమావేశంలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి నిన్న రాత్రి మాస్కో చేరుకున్నారు. రష్యన్ సైనికాధికారుల్లో ఒకరు షేక్ హ్యాండ్ ఇవ్వబోగా సున్నితంగా తిరస్కరించిన రాజ్ నాథ్  ‘నమస్తే’ అంటూ చేతులు జోడించారు. మరో సైనికాధికారి సైతం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించగా నమస్కారం చేయడంతో ఆ అధికారి సైతం  ప్రతి నమస్కారం చేయడం విశేషం.

మరోవైపు భారత్‌, రష్యా ద్వైపాక్షిక రక్షణ శాఖ బలోపేతం కావడానికి ఈ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. కాగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇరు దేశాల సహకరించుకో బాగా ఉపయోగించారు.  గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో నమస్తే పదాన్ని బాగా ఉపయోగించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇండియా వచ్చినపుడు నమస్తే ట్రంప్ పేరుతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నమస్తే పదం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రష్యాలో రాజ్‌నాథ్‌ ‘నమస్తే’ పెట్టడం ద్వారా భారతీయుల మనసులు గెలుచుకున్నారు. చదవండి: రఫెల్‌ రాక.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

>
మరిన్ని వార్తలు