ఇరాన్‌తో చర్చలు ఫలవంతం

7 Sep, 2020 03:54 IST|Sakshi
హటామితో రాజ్‌నాథ్‌ సింగ్‌

టెహ్రాన్‌: ఇరాన్‌ రక్షణ మంత్రి అమీర్‌ హటామితో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతతోపాటు అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. పలు అంశాలపై పరస్పరం అభి ప్రాయాలు పంచుకున్నామని, ఈ చర్చలు ఫలవంతమయ్యా యని రాజ్‌ నాథ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. రాజ్‌నాథ్‌ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని అక్కడి నుంచి శనివారం ఇరాన్‌కు వచ్చారు. ఇరాన్‌ రక్షణ మంత్రి వినతి మేరకే ఈ భేటీ జరిగిందని రక్షణ శాఖ తెలిపింది. ఇరువురు నేతలు సాంస్కృతిక, భాషా, పౌర సంబంధాలు తదితర అంశాలపై సుహృ ద్భావ వాతావరణంలో చర్చలు జరిపారని చెప్పింది.

ప్రాంతీయ భద్ర త, శాంతి పరిరక్షణ కోసం ఇరు దేశాల అధికారులు పరస్పరం సం ప్రదింపులు జరుపుతూనే ఉన్నారంది. ‘ఈ రీజియన్‌లోని దేశాలతో భా రత్‌ స్నేహ సంబంధాలను కోరుకుంటుంది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు , ద్వైపాక్షిక సంబంధాల్లో ఇతరుల జో క్యం నివారణకు కృషి చేస్తాం’అని రాజ్‌నాథ్‌ చెప్పారు. అంతర్యుద్ధం తో అతలా కుతలమవుతున్న అఫ్గానిస్తాన్‌లో పరిస్థితిపై భారత్‌ ఆం దోళ న వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్‌ మంత్రితో భేటీ ప్రాధాన్యం సంత రించుకుంది.  తాలిబాన్లు అమెరికాతో శాంతి ఒప్పందం కుదు ర్చు కు న్న తర్వాత  రాజకీయ సుస్థిరత ఏర్పాటుపై భారత్‌ మరింత దృష్టిసారించింది.
 

మరిన్ని వార్తలు