Rare Incident: అరుదైన సంఘటన.. ఏనుగుకు కవల పిల్లలు!

2 Sep, 2021 14:38 IST|Sakshi
ఫొటో: రాయిటర్స్‌

కొలంబో: శ్రీలంకలో 80 ఏళ్ళ తర్వాత ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. 25 యేళ్ళ సురంజి అనే ఆడ ఏనుగు మగ కవలలకు జన్మనిచ్చింది. ఏనుగుల అనాథ ఆశ్రమంలో మంగళవారం రెండు మగ ఏనుగు పిల్లలు పుట్టాయని.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాయని పిన్నవాలా ఏనుగుల అనాథ ఆశ్రమ నిర్వహకులు తెలిపారు. 1941లో తొలిసారిగా ఒక ఏనుగు కవలపిల్లలను ఈనిందని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాఆ మరొక సారి ఈ అద్భుతం చోటుచేసుకుందని ఏనుగుల నిపుణుడు జయంత జయవర్దనే తెలిపారు.

సురంజి 2009లో ఒక మగ ఏనుగు పిల్లకు జన్మనిచ్చిందని, ఇప్పుడు రెండో సారి రెండు మగ ఏనుగు పిల్లలకు జన్మనిచ్చిందని వివరించారు. అయితే శ్రీలంక స్థానికుల్లో కొందరు తమ గొప్పదనాన్ని ప్రదర్శించుకోడానికి ఏనుగులను పెంచుకుంటారు.  వాటి సంరక్షణలో నిర్లక్క్ష్యం వహించేవారి నుంచి గాయపడిన, ఆరోగ్యం క్షీణించిన ఏనుగులను చేరదీసి ఈ అనాథ ఆశ్రమంలో రక్షణ కల్పిస్తారు. ఇక ఏనుగులను హింసించే వారికి వారికి 3 యేళ్ల జైలు శిక్ష విధించే విధంగా అక్కడ చట్టాలు అమల్లో ఉన్నాయి. వైల్డ్‌ లైఫ్‌ అధికారిక రికార్డుల ప్రకారం శ్రీలంకలో 200 పెంపుడు ఏనుగులు, 7 వేల అడవి ఏనుగులు ఉన్నట్టు వెల్లడించారు.

చదవండి: గోల్డ్‌ వడపావ్‌ను చూశారా? ధర తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

మరిన్ని వార్తలు