Albrecht Dürer: అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!!

29 Nov, 2021 11:09 IST|Sakshi

German Renaissance Artist Albrecht Dürer Painting: ఐదేళ్ల క్రితం అమెరికాలో హౌస్ క్లియరెన్స్ సేల్‌లో  కేవలం 30 డాలర్ల (రూ. 2,250)కు కొన్న ఓ పెయింటింగ్‌ ఇప్పుడు వేల కోట్ల ధర పలుకుతోంది. ఈ పెయింటింగ్‌ 500 ఏళ్ల నాటి అద్భుత కళాఖండం మరి! దీనిని గీసిన చిత్రకారుడెవరో.. ఎందుకంత ధర పలుకుతోందో ఆ విశేషాలు మీ కోసం..

ఆల్బ్రెచ్ట్ డ్యూరర్ ఒక జర్మన్ చిత్రకారుడు. జర్మనీ పునరుజ్జీవనోద్యమ సమయంలో అతను ఐరోపా అంతటా బాగా పేరు పొందాడు. ముఖ్యంగా వుడ్‌కట్ ప్రింట్‌లకు ప్రసిద్ధి చెందిన ఆల్బ్రెచ్ట్ డ్యూరర్.. రాఫెల్, గియోవన్నీ బెల్లిని, లియోనార్డో డావిన్సీ వంటి కళాకారులతో సన్నిహితంగా ఉండేవాడు. అతని ‘ఫోర్ హార్స్‌మెన్ ఆఫ్ ది అపోకలిప్స్’ అనే పెయింటింగ్‌ ఆర్ట్‌ హిస్టరీలోనే గొప్పదిగా పేరుగాంచింది. 

ముఖ్యంగా ఇతను ఒక తల్లి, బిడ్డలను పసుపు నారపై వేసిన ఆర్ట్‌వర్క్.. ఆర్ట్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోనోగ్రామ్‌లలో ఒకటిగా ఎంచబడుతోంది. మొత్తం మోనోగ్రామ్ డ్రాయింగ్‌ను ఒకేరకమైన సిరాతో వేయబడింది. కనీసం 200 షీట్‌లపై వాటర్‌మార్క్ కనిపించే కాగితంపై ఈ పెయింటింగ్‌ వేశాడా జర్మన్‌ చిత్రకారుడు. ఈ అరుదైన కళాఖండాన్ని ఇప్పుడు లండన్‌లోని ఆగ్‌న్యూస్‌ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. 

స్మిత్సోనియన్ మ్యాగజైన్ కథనాల ప్రకారం.. ఈ చిత్రాన్ని అగ్‌న్యూస్‌ గ్యాలరీ విక్రయించాలని యోచిస్తోంది. అయితే స్థిరమైన ధర ఇంకా నిర్ణయించబడలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర 374 కోట్ల 33 లక్షలు పలకవచ్చని నిపుణుల అంచనా.

చదవండి: డిసెంబర్‌ 12న మిస్‌ యూనివర్స్‌ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం..: పర్యాటక మంత్రి

మరిన్ని వార్తలు