130 ఏళ్ల అనంతరం మంచు గుడ్లగూబ దర్శనం..

30 Jan, 2021 11:51 IST|Sakshi

న్యూయార్క్‌: న్యూయార్క్‌ సిటీలోని సెంట్రల్‌ జూ పార్కు‌లో అరుదైన జాతికి చెందిన మంచు గుడ్లగూబ సందడి చేస్తోంది. 130 ఏళ్ల క్రితం అమెరికాలో కనిపించిన ఈ జాతి గుడ్లగూబ మళ్లీ పార్కులో దర్శనమివ్వడంతో పక్షి ప్రేమికులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిని చుసేందుకు అక్కడకు క్యూ కడుతున్నారు. ఆ పక్షితో తీసుకున్న సెల్ఫీలను, ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో ఈ గుడ్లగూబ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ అరుదైన జాతి గుడ్లగూబను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘నమ్మలేకపోతున్నాం.. ఇది ఎంత అందంగా ఉంది’, ‘అరుదైన హిస్టారికల్‌ మంచు గుడ్లగూబను చూస్తుంటే అద్బుతంగా ఉంది’, ‘మళ్లీ దీనిని చూసే అవకాశం రావడం అదృష్టం’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ చేస్తున్నారు. (చదవండి: ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో..)

కాగా ఈ మంచు గుడ్లగూబలు సెంట్రల్‌ పార్కులో 1890లో అమెరికాలో ఎక్కువగా ఉండేవని, ఆ తర్వాత రానురాను అవి కనుమరుగయ్యాయని జూ నిర్వహకులు తెలిపారు. అమెరికా నేచురల్ హిస్టరీ మ్యూజియం పక్షిశాస్త్ర విభాగ కలెక్షన్ మేనేజర్ పాల్ స్వీట్ తెలిపారు. అయితే ఇవి ఆర్కిటిక్ ప్రాంతంలోని టండ్రాల్లో నివసిస్తుంటాయని, శీతాకాలంలో మాత్రం దక్షిణ దిశగా ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇక మంచు గుడ్లగూబను చూసేందుకు పర్యటకులంతా పొటెత్తుతున్నారు. దాంతో  పర్యాటకులను చూసి ఆ గుడ్లగూబ భయాందోళనకు గురవుతుండంతో జూ అధికారులు వారిని అప్రమత్తం చేస్తున్నారు. ఈ పక్షిని చూడాలంటే బైనాక్యులర్లు తప్పనిసరిగా ఉపయోగించాలని పర్యాటకులకు సూచిస్తున్నారు.  (చదవండి: ‘పులికి ఉన్న జ్ఞానం కూడా లేదు’)

మరిన్ని వార్తలు