White Peacock Video: అత్యద్భుతమైన తెల్లటి నెమలి! వీడియో వైరల్‌

30 Apr, 2022 14:24 IST|Sakshi

white peacock captured in flight: సాధారణంగా నెమలి అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నెమళ్లు ఎక్కడైన కనిపిస్తే చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా తన్మయంతో చూస్తుంటారు. నిజానికి తెల్లటి నెమళ్లు గురించి గానీ అవి ఉంటాయని గానీ ఎవ్వరికీ తెలియదు. ఈ వైరల్‌ వీడియో చూస్తే కచ్చితంగా పాల నురుగులాంటి ఒక అత్యద్భుతమైన నెమలి ఉందని ఒప్పుకుంటారు.

వివరాల్లోకెళ్తే....ఉత్తర ఇటాలియన్ ద్వీపం ఐసోలా బెల్లాలోని బరోక్ గార్డెన్‌లోని శిల్పం వద్ద ఒక అరుదైన దేవతా పక్షిలా కనువిందు చేసింది. తొలుత ఈ పక్షిని చూసిన వెంటనే ఏంటిది అనిపిస్తుంది. దాన్ని నిశితంగా చూస్తే గాని అది తెల్లటి నెమలి అని అవగతమవదు. అంతేకాదు దాని ఈకలు తెల్లగా దేవతా పక్షి అనిపించేలా మెరుస్తూ ఉంటాయి. అయితే ఇవి లూసిజం అని పిలువబడే జన్యు పరివర్తన అని శాస్తవేత్తలు అంటున్నారు. ఇవి ఎక్కువగా బంధింపబడే ఉంటాయని చెబుతున్నారు. వీటి జనాభా కూడా చాలా తక్కువేనని అంటున్నారు.

(చదవండి: నాగుపాముతోనే నాగిని డ్యాన్స్‌.. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు)

మరిన్ని వార్తలు