రష్యాలో భాగం కావడానికి ఓటింగ్‌ నిర్వహించనుందా?.. అప్పుడు అలానే చేసింది

27 Mar, 2022 19:37 IST|Sakshi

May Vote On Joining Russia: రష్యా గత నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అంతేగాక రష్యా ఇటీవలే తన తొలి సైనిక చర్య పూర్తయిందని ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో రిపబ్లిక్ భూభాగంపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగవచ్చు అని ఉక్రెయిన్‌లోని లుగాన్స్క్ వేర్పాటువాద ప్రాంత అధిపతి లియోనిడ్ పసెచ్నిక్ పేర్కొన్నారు.

అంతేకాదు రష్యా ఈ సమయంలో ప్రజలు రష్యన్ ఫెడరేషన్‌లో చేరడంపై అభిప్రాయాన్ని సేకరించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విషయమై రష్యా చట్ట సభ సభ్యుడు లియోనిడ్ కలాష్నికోవ్ మాత్రం ఇప్పుడూ అలా చేసేందుకు సరైన సమయం కాదన్నారు. అయితే ఉక్రెయిన్‌కి తూర్పున ఉన్న స్వయం ప్రకటిత డోనెట్స్క్ లుగాన్స్క్ రిపబ్లిక్‌లకు రక్షణగా వ్యవహరిస్తోందని రష్యా పేర్కొంది. అంతేగాక ఉక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉందని రష్యా ఎగువ సభలోని రాజ్యాంగ శాసన కమిటీ అధిపతి ఆండ్రీ క్లిషాస్ అన్నారు. ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాన్ని రష్యా గుర్తించినట్లు ప్రకటించింది కూడా.

ఈ ప్రాంతాల అధికారులు తమ రాజ్యాంగాలకు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు వారిక ఉందని స్పష్టం చేసింది. రష్యన్ మాట్లాడే ప్రాంతాలు 2014లో 14 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయి  కైవ్ నియంత్రణ నుంచి వైదొలగాయి. ఫిబ్రవరి 2014లో కైవ్‌లో జరిగిన ప్రజా తిరుగుబాటులో మాస్కో అనుకూల నాయకుడిని తొలగించి, రష్యాలో భాగమవడంపై దక్షిణ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే రష్యా క్రిమియాను ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకుంది. కాబట్టి మళ్లీ ఇప్పుడూ కూడా రష్యా అలానే చేస్తుందేమోనని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

(చదవండి: ష్యా పై నోరు పారేసుకోవడమే తప్ప ఉక్రెయిన్‌కి చేసిందేమీ లేదు! ఉక్రెయిన్‌ ఎంపీ)

మరిన్ని వార్తలు