అమెరికా 160 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి.. 15 రౌండ్ల వరకు సాగిన స్పీకర్‌ ఎన్నిక

7 Jan, 2023 12:21 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌)లోని ప్రతినిధుల సభ నూతన స్పీకర్‌గా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి కెవిన్‌ మెక్‌కార్తీని ఎన్నికయ్యారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ మెక్‌కార్తీకి మద్దతు తెలిపారు నేతలు. రిపబ్లికన్‌ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలతో 15 రౌండ్ల హైడ్రామా తర్వాత స్పీకర్‌ను ఎన్నుకున్నారు.

ప్రతినిధుల సభ స్పీకర్‌గా ఎన్నికయ్యేందుకు ఈ 57 ఏళ్ల కాలిఫోర్నియన్‌ నేత మెక్‌కార్తీకి మొదటి రౌండ్లోనే సులభంగా మెజారిటీ రావాల్సింది. కానీ, పార్టీలో అంతర్గతంగా నెలకొన్న విభేదాల కారణంగా కొంత మంది నేతలను ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చారు. అమెరికా కాంగ్రెస్‌ 160 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘ కాలం సాగిన స్పీకర్‌ ఎన్నికగా నిలించింది. మెక్‌కార్తీని స్పీకర్‌గా ఎన్నుకునేందుకు రిపబ్లికన్‌ నేతలు 15 రౌండ్ల ఓటింగ్‌ వరకు తీసుకెళ్లారు. 

ఇదీ చదవండి: స్పీకర్‌ పదవికి పోటీలో డొనాల్డ్‌ ట్రంప్‌.. వచ్చింది ఒకే ఒక్క ఓటు

మరిన్ని వార్తలు