రెస్టారెంట్‌ సిబ్బంది నిర్వాకం...వాటర్‌ బాటిళ్లలో యాసిడ్‌ అందించి...

4 Oct, 2022 16:15 IST|Sakshi

పుట్లిన రోజు, పెళ్లి వేడుక లేక మనం ఆనందంగా ఉన్నప్పుడూ సరదాగా రెస్టారెంట్‌కి వెళ్లి స్నేహితులకు ట్రీట్‌ ఇచ్చి సెలబ్రెట్‌ చేసుకుంటాం. కానీ ఇప్పుడూ ఈ విచిత్రమైన సంఘటన గురించి వింటే రెస్టారెంట్‌కి వెళ్లాలంటేనే జంకుతారు. ఇక్కడొక కుటుంబం పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు రెస్టారెంట్‌కి వెళ్లి ఘోరమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని ఒక రెస్టారెంట్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే....పాకిస్తాన్‌లోని ప్రముఖ ఇక్బాల్‌ పార్క్‌లోని పోయిట్‌ రెస్టారెంట్‌లో ఒక కుటుంబం పుట్టిన రోజుల వేడుకలు జరుపుకుంది. ఐతే ఆ రెస్టారెంట్‌ సిబ్బంది నిర్లక్షపూరిత ధోరణితో సదరు కస్టమర్లకు భోజనంలో వాటర్‌ బాటిళ్లలో యాసిడ్‌ని సర్వ్‌ చేశారు. దీంతో ఆ బాటిల్‌ని ఉపయోగించి ఇద్దరి చిన్నారుల్లో ఒకరు చేతులు కడుక్కోగా, మరోకరు తాగారు. అంతే కొద్దిసేపటికి ఒకరు మంట మంట అని ఏడవడం, మరోకరు వాంతులు చేసుకుని అశ్వస్థకు గురవ్వడం జరిగిందని చిన్నారులు కుటుంబసభ్యలు చెబుతున్నారు.

ఈ మేరకు బాధితుల కుటుంబం సభ్యుడు మహ్మద్‌ ఆదిల్‌ మాట్లాడుతూ తన మేనకోడలు రెండేళ్ల వాజిహ, మేనల్లుడు అహ్మద్‌, రెస్టారెంట్‌​ సిబ్బంది అందించిన వాటర్‌ బాటిల్‌లోని యాసిడ్‌ కారణంగా తీవ్ర అశ్వస్థకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఐతే మేనకోడలు వాజిహ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు.

భాదితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరుకు పోలీసులు సదరు రెస్టారెంట్‌  మేజర్‌ మహ్మద్‌ జావెద్‌ తోపాటు ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. అలాగే దర్యాప్తు పూర్తయ్యే వరకు రెస్టరెంట్‌ని మూసేశారు. ఈ మేరకు పోలీస్‌ అధికారి తాహిర్‌ వాకస్‌ మాట్లాడుతూ..ఇది చాలా విచిత్రమైన సంఘటన అని, తాము ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

(చదవండి: యూఎస్‌లో ఎనిమిదేళ్ల చిన్నారితో సహ భారత సంతతి కుటుంబం కిడ్నాప్‌)


 

మరిన్ని వార్తలు