Richard Branson: స్పేస్‌ టెక్‌ సంస్థలో భారీ పెట్టుబడులు 

13 Jul, 2021 13:33 IST|Sakshi

స్పేస్‌ టెక్‌  సంస్థలో భారీ పెట్టుబడులు 

అటు రోదసీ యాత్ర విజయవంతం

ఇటు స్పేస్‌ సంస్థ  సెరాఫిమ్  వాటాల కొనుగోలు

లండన్‌:  రోదసీ యాత్రతో  బిలియనీర్లలో జెలస్‌ రేపుతున్న వర్జిన్ గెలాక్టిక్ అధిపతి  బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పేస్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లో  భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టాడు.  ఈ మేరకు లండన్‌కు  చెందిన సెరాఫిమ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.   

ఈ కొనుగోలు మొత్తం వివరాలను సెరాఫిమ్ వెల్లడించలేదు. ‍అయితే ప్రాథమికంగా 178 మిలియన్ పౌండ్ల (246.99 మిలియన్ డాలర్లు) విలువైన వాటాలను కొనుగోలు చేసినట్లు  తెలిపింది. అలాగే ఇటీవల ఐవీవో పూర్తి చేసుకున్న సెరాఫిమ్‌ భాగస్వామ్య కంపెనీలలో ఎయిర్ బస్ ఎస్‌ కూడా ఒకటి.  త్వరలోనే లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ ప్రారంభించనున్న సెరాఫిమ్  ప్రకారం  ఐపీవోలో భారీ పెట్టుబడులు పెట్టింది ఎయిర్ బస్.  

మరిన్ని వార్తలు