మారడోనా మృతి.. ట్రెండింగ్‌లో రిప్‌‌ మడోన్నా

27 Nov, 2020 08:44 IST|Sakshi

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా) : ప్రపంచ పుల్‌బాల్‌ దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా మృతి అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. సాకర్‌ స్టార్‌ ప్లేయర్‌ ఇక లేరనే వార్త పుట్‌బాల్‌ ప్రియులను శోకసంద్రంలో ముంచింది. కేవలం ఆటలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్న మారడోనా ఇకలేడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పుట్‌బాల్‌ మాంత్రికుడి మరణవార్త ప్రపంచ క్రీడా లోకాన్ని కన్నీటిసంద్రంలో ముంచింది. తమ ఆరాధ్య ఆటగాడి కోసం యావత్‌ అర్జెంటీనా విలపించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా డీగో అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా నివాళి అర్పించారు. రిప్‌ మారడోనా అంటూ సాకర్‌ దిగ్గజానికి కడసారి వీడ్కోలు పలికారు. అయితే కొంత అభిమానులు చేసిన తప్పిదం హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ మడోన్నాకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎంకి పెళ్లి.. సుబ్బి సావుకొచ్చినట్టు మారడోనాకు బదులుగా రిప్‌ మడోన్నా అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. (గుడ్‌బై మారడోనా)


చనిపోయింది మారడోనానా లేక మడోన్నా అన్న విషయంపై క్లారిటీ లేకుండా ఏకంగా రిప్‌ మడొన్నా అంటూ ట్వీట్‌ చేయడం ఆరంభించారు. ఇది చూసిన కొంతమంది షాక్‌అవ్వగా.. మరికొంత మంది అభిమానులు మాత్రం నిజంగానే ఆమె మరణించిందని సోషల్‌ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ అభిమాన సింగర్‌ మృతిని జీర్ణించుకోలేపోతున్నామని విలపించారు. ఆమె పాటలు, వీడియోలో షేర్‌ చేస్తూ నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ‘రిప్‌ మడోన్నా’ అనే ట్వీట్‌కాస్తా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా