గుడ్‌ క్యాచ్‌! ఆకాశం నుంచి పడిపోతున్న రాకెట్‌ని పట్టుకున్న హెలికాప్టర్‌! వీడియా వైరల్‌

4 May, 2022 14:41 IST|Sakshi

US-based launch firm was partially successful: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రాకెట్‌ల్యాబ్‌ ప్రయోగ సంస్థ ఒక అత్యద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలలో ఒక గొప్ప మైలురాయిని సాధించింది. అంతరిక్షంలోకి బహుళ ఉపగ్రహాలతో రాకెట్‌ని పంపే ఖర్చుని తగ్గించుకునేలా వాటిని తిరిగి భూమ్మీదకు తీసుకువచ్చేందుకు చేసిన ఒక ప్రయోగం అద్భుతమైన విజయాన్ని సాధించింది.

అపర కుభేరుడు, స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలెన్‌ మస్క్‌ ఈ రాకెట్‌ ల్యాబ్‌ని నిర్వహిస్తున్నారు. న్యూజిల్యాండ్‌లో బుధవారం ఉదయం 10.50 గంటలకు అంతరిక్షంలోని కక్ష్యలోకి 34 ఉపగ్రహాలను పంపడానికి బయలుదేరిన బూస్టర్‌ రాకెట్‌ ఆకాశంలో ఒకనొక దశలో కొంత ఎత్తుకు చేరుకున్న తర్వాత భూమ్మీద పడిపోబోతోంది. అదే సమయంలో న్యూజిలాండ్‌ తీరంలో సౌత్‌ పసిఫిక్‌కి సమీపంలో ఉన్న ఒక హెలికాప్టర్‌ రాకెట్‌ని పట్టుకునేందుకు 22 మైళ్ల దూరంలో ఒక  పారాచూట్‌ని వదిలింది.

హెలికాప్టర్‌ పారాచూట్‌, కేబుల్‌ వైర్ల సాయంతో ఆ రాకెట్‌ని పట్టుకుంది. ఆ తర్వాత ఆ రాకెట్‌ పసిఫిక్‌ మహా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ మేరకు ఈ రాకెట్‌ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది గానీ ఆ రాకెట్‌ని సముద్రంలో పడకుండా భూమ్మీదకు తేగలిగినట్లయితే పూర్తి స్థాయిలో విజయం సాధించనట్లు అని రాకెట్ ల్యాబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ బెక్ చెప్పారు. ఆ రాకెట్‌ సురక్షితంగా సముద్రంలోకి వెళ్లిందని, దాన్ని ఓడ సాయంతో తిరిగి తీసుకువస్తామని తెలిపారు. ఐతే ఆ బూస్టర్‌ రాకెట్‌ తిరిగి వినయోగించనుందా లేదా అనేది స్పష్టం చేయలేదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: నేనేం రోబోను కాదు.. నాకూ ఫీలింగ్స్‌ ఉన్నాయి: ఎలన్‌ మస్క్‌)

మరిన్ని వార్తలు