ట్రక్‌ డ్రైవర్‌కు న్యాయం జరిగింది.. 110 ఏళ్ల జైలు శిక్ష పదేళ్లకు తగ్గింపు

2 Jan, 2022 15:31 IST|Sakshi

ట్రక్‌ డ్రైవర్‌కు 110ఏళ్ల జైలు శిక్ష విధించింది ఓ కోర్టు. ఈ తీర్పుపై పెద్దఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. రోజెల్ అగ్యిలేరా-మెడెరోస్ అనే ఓ వ్యక్తి నడుపుతున్న ట్రక్‌ 2019లో అమెరికాలోని కొలరాడోలో ప్రమాదవశాత్తు లారీపైకి దూసుకేళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ కేసులో అరెస్ట్‌ అయిన రోజెల్‌కు కోర్టు భారీ శిక్ష(110 ఏళ్ల కారాగారం) విధించింది. క్యూబా దేశస్తుడైన రోజెల్‌.. రాకీ పర్వత ప్రాంతంలో కలపను రవాణా చేసే ట్రక్‌ డైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో తను నడుపుత్ను ట్రక్‌కు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయని, వాహనాన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాని రోజెల్‌ తెలిపాడు. తను కావాలని లారీని ఢికొట్టలేదని పేర్కొన్నాడు.

అయితే అతని వాదనలు కొట్టిపారేసిన కొలరాడో కోర్టు.. 110 ఏళ్ల జీవితా కారాగార శిక్ష విధించింది. అతనికి విధించిన భారీ శిక్ష అన్యాయమని పెద్ద ఎత్తున కొలరాడోలో ర్యాలీలు నిర్వహించారు. ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్‌ కిమ్‌ కర్దేషియన్‌ వెస్ట్‌ కూడా రోజెల్‌కు విధించిన శిక్ష తగ్గించాలనే పిటిషన్‌కు మద్దతు తెలిపింది. అదేవిధంగా కొలరాడోలోని ట్రక్‌ డ్రైవర్లు​ అతనికి విధించిన భారీ శిక్షకు వ్యతిరేకంగా ట్రక్‌లను నడపటం బాయ్‌కాట్‌ చేస్తున్నామని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

దీంతో ఒక్కసారిగా రోజెల్‌కు విధించిన శిక్ష అన్యాయమని పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది. తీవ్రమైన విమర్శలు వెళ్లువెత్తున్న సమయంలో గురువారం ట్రైయర్‌ కోర్టు  రోజెల్‌ కేసుపై మరోసారి విచారణ చేపట్టింది. అయితే అతనికి విధించిన 110 ఏళ్ల జైలు శిక్షను పదేళ్లకు తగ్గిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. తాజాగా వెల్లడించిన కోర్టు తీర్పుపై రోజెల్‌ తల్లి ఆనందం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు