UK: ఆమె చెప్పకపోతే ఎప్పటికీ బయటికి వచ్చే ఛాన్స్‌ లేదు..

5 Dec, 2021 18:16 IST|Sakshi

యూకే: ఓ మహిళ అకౌంటుకు పొరబాటున ఏకంగా 7.7 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఐతే జమ చేసిన సంస్థ పొరపాటున ఈ తప్పు చేసినప్పటికీ సదరు మహిళ పిర్యాదు చేసేంత వరకూ దానిని గమనించలేదట. స్థానిక మీడియా కథనాల ప్రకారం..

యూకేకు చెందిన మహిళ అకౌంటుకు ఆగస్టు 2020న హర్‌ మెజెస్టీస్‌ రెవెన్యూ అండ్‌ కస్టమ్స్‌ (హెచ్‌ఎమ్‌ఆర్సీ) నుంచి 7,74,839 పౌండ్లు (సుమారు 7.7 కోట్ల రూపాయలు) జమ అయ్యాయి. అంతేకాదు ఈ మిస్టరీ డిపాజిట్‌ నుంచి అప్పటికే 20 వేల పౌండ్లు ఖర్చు చేసింది కూడా. ఐతే ఖర్చుచేసిన మొత్తాన్ని చెల్లించే స్థితిలో ప్రస్తుతం ఆమె లేదు. తర్వాత అకౌంటును చెక్‌ చేసుకున్న సదరు మహిళ మిస్టరీ డిపాజిట్‌ గురించి తీవ్ర ఆందోళనకు గురైంది. నిజానికి ఈ విధమైన పొరబాట్లు యూకేలో సెక్షన్‌ 24ఎ దొంగతనం చట్టం 1968 ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. పొరపాటున జమ అయిన మొత్తాన్ని సంబంధిత వ్యక్తులకు చెల్లించవల్సిన బాధ్యత అకౌంటుదారులే నిర్వర్తించాలి. 

చదవండి: ఆ మూడే ఒమిక్రాన్‌ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే..

ఐతే నవంబర్ 2020లో పన్ను చెల్లించినప్పుడు హెచ్‌ఎమ్‌ఆర్సీ సిబ్బంది తమ తప్పును గమనిస్తారని మహిళ భావించింది. కానీ అలా జరగలేదు. డబ్బు ఆమె ఖాతాకు మాత్రమే కేటాయించబడినందున, ఆమె ముందుకు రాకపోతే అది ఎప్పటికీ గుర్తించబడకపోవచ్చు. దీంతో ఆమె ఫోను ద్వారా హెచ్‌ఎమ్‌ఆర్సీని సంప్రదించి పొరపాటును గుర్తుచేసింది. పార్శిల్ కస్టమ్స్ డ్యూటీ రాయితీని చెల్లించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సిబ్బంది పొరపాటున 23.39 పౌండ్లకు బదులు అధికమొత్తాన్ని జమ చేసినట్లు హెచ్‌ఎమ్‌ఆర్సీ ఎట్టకేలకు కనుగొంది. దీని గురించి హెచ్‌ఎంఆర్‌సి ప్రతినిధి మాట్లాడుతూ.. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాము. చెల్లింపును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాం. ఐతే ఇంత పెద్ద మొత్తం పొరబాటున క్రెడిట్ అవ్వడం ఇంతవరకూ జరగలేద’ని మీడియాకు తెలిపారు. దాదాపుగా 15 నెలల తర్వాత ఈ విషయం తాజాగా వెలుగులోకొచ్చింది.

చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా?

>
మరిన్ని వార్తలు