ట్రంప్‌ లాయర్‌ తింగరి చర్యలు.. నెటిజనుల రియాక్షన్‌

20 Nov, 2020 12:09 IST|Sakshi

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని భావిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న అతడి పర్సనల్‌ డిఫెన్స్‌ న్యాయవాది రూడీ గియులియానికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల్లో జో బైడెన్‌ అక్రమాలకు పాల్పడ్డారంటూ నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుండగా ఆయన హెయిర్‌ డై కరిగి ముఖం మీదకు కారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతుండగా.. దాన్ని తలదన్నే మరో వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఇది కూడా రూడీ గియులియానికి చెందినదే కావడం విశేషం. ఇక ఈ వీడియోలో రూడీ గియులియాని చర్యలు చూస్తే.. నవ్వు, ఆసహ్యం రెండు ఒకేసారి వస్తాయి. ఇక ఈ వీడియోలో రూడీ ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఇంతలో ఓ నాప్‌కిన్‌ తీసి ముక్కు చీదుకుంటాడు. అనంతరం దాన్ని పడేయకుండా మరో వైపు మడతపెట్టి.. దానితో నోరు, నుదురు తుడుచుకుంటాడు. ఆ తర్వాత దాన్ని తీసి జేబులో పెట్టుకుంటాడు. ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 1.5మిలియన్ల మంది వీక్షించారు. (చదవండి: బైడెన్‌ గెలిచాడని ఒప్పుకున్న ట్రంప్‌!)

ఇక నెటిజనులు ఆయన్ని ఓ ఆట ఆడేసుకున్నారు. ‘ఓరే నాయన అసలే ఇది కోవిడ్‌ కాలం. నువ్వేమో ఏ మాత్రం జాగ్రత్త లేకుండా ముక్కు తుడుచుకున్న నాప్‌కిన్‌తోనే ముఖం తుడుచుకున్నావ్‌.. ఏంటి నీ ధైర్యం’.. ‘అరే అక్కడ నాప్‌కిన్‌ బండిల్‌ పెట్టండి’.. ‘ఇదంతా లైవ్‌లో టెలికాస్ట్‌ అవుతుంది.. మర్చిపోయావా’.. ‘కోవిడ్‌, ఇతర జబ్బులు ఎలా వ్యాప్తి చెందుతాయో వివరించడానికి నువ్వు సరైన ఉదాహరణ’ అంటూ నెటిజనులు కామెంట్‌ చేశారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికి ట్రంప్‌, అతడి మద్దతుదారులు దాన్ని అంగీకరించడం లేదు. జో బైడెన్‌ ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు