రష్యాలో విషాదం: వేడి నీటి పైపు పగిలి నలుగురు మృతి!

23 Jul, 2023 09:50 IST|Sakshi

రష్యాలోని మాస్కోలో ఒక షాపింగ్ మాల్‌లో వేడి నీటి పైపు పగిలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 70 మంది గాయపడ్డారు.  టాస్ అనే వార్తా సంస్థకు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్‌ ఈ విషయాన్ని తెలియజేశారు. షాపింగ్ మాల్‌లో జరిగిన ప్రమాదం నలుగురి ప్రాణాలను బలిగొందని మేయర్ టెలిగ్రామ్ ఛానెల్‌ ద్వారా తెలిపారు. మృతుల కుటుంబాలకు, స్నేహితులకు సంతాపం తెలిపారు.

తొమ్మిది మంది ఆసుపత్రిలో చేరిక..
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మాల్‌లోని పైపు పగిలిపోవడంతో మాల్‌లోని కొంత భాగంలోకి వేడినీరు ప్రవేశించింది. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. మరో 20 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక వైద్య అధికారి.. టాస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పైపు పగిలిపోవడంతో పది మంది వేడి నీళ్ల బారిన పడ్డారని, వారిలో తొమ్మిది మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.

నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు 
ఈ ఉదంతంపై రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ దర్యాప్తు ‍ప్రారంభించింది. నలుగురు నిందితులపై గ్రూప్ క్రిమినల్ కేసు పెట్టామని ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రతినిధి యులియా ఇవనోవా మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్క్యూ టీమ్  నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించింది. 
ఇది కూడా చదవండి: బైడెన్‌పై అభిశంసనకు సిద్ధమైన రిపబ్లికన్లు 

మరిన్ని వార్తలు