ఇలా జరుగుతుందని అనుకోలేదు.. చాలా విషాదకరం: రష్యా

8 Apr, 2022 17:26 IST|Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్‌ ప్రకటించి నాలభై రోజులు దాటింది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా భారీగానే నష్టపోయింది. ముఖ్యంగా ఇరువర్గాలు తమ సైనిక బలగాలను చాలా వ‌ర‌కు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. దిమిత్రీ మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా భారీ స్థాయిలో రష్యన్‌ బలగాలను కోల్పోయామ‌ని, జరిగిన ఘటన చాలా విషాద‌క‌ర‌మ‌ని ఆయన అవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. యుద్ధ ప్రారంభంలో ఇంత నష్టం జరుగుతుందని ఊహించనట్లు తెలిపారు.

 ఇక తొం‍దర్లోనే తమ యుద్ధ ల‌క్ష్యాల‌ను చేరుకోనున్నట్లు ఆయ‌న చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టి ఆరు వారాల కాగా ఇప్పటికే 4 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్‌ని విడిచి విదేశాలకు వలస వెళ్లారు. అంతేకాకుండా వేలాది మంది గాయపడడంతో పాటు మరణాలతో కీవ్‌ నగరం మారుమోగింది. దీనికి ప్రతీకాత్మక చర్యగా.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రష్యాను యూఎన్‌ మానవ హక్కుల మండలి నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత రష్యా కూడా ఈ కౌన్సిల్ నుంచి వైదొలిగింది.  

ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతున్న దాడులు కారణంగా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా రష్యా గత మూడు దశాబ్దాలుగా రష్యా చూడని అత్యంత క్లిష్ట ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటుందని ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ అన్నారు.  యూఎస్‌ కాంగ్రెస్‌ కూడా రష్యాని దాని మోస్ట్‌ వాంటెడ్‌ కంట్రీ జాబితా నుంచి తొలగించింది. దీని మూలాన వాణిజ్య పరంగా రష్యాకు మరింత దెబ్బ తగలనుంది.

చదవండి: వార్నింగ్‌ ఇచ్చినా హ్యాండ్‌ ఇచ్చిన భారత్‌.. పుతిన్‌ రెస్పాన్స్‌పై టెన్షన్‌!

మరిన్ని వార్తలు