Russia Ukraine War డోన్బాస్‌ చిక్కింది: రష్యా

8 Jun, 2022 01:20 IST|Sakshi

తూర్పు ఉక్రెయిన్లో మరింత సైన్యం 

ప్రతి అంగుళాన్నీ స్వాదీనం చేసుకుంటాం: ఉక్రెయిన్‌ 

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌ ప్రాంతం 97 శాతానికి పైగా తమ నియంత్రణలోకి వచి్చందని రష్యా మంగళవారం ప్రకటించింది. ముఖ్యంగా లుహాన్స్‌క్‌ ప్రాంతాన్ని పూర్తిగా స్వాదీనం చేసుకున్నట్టు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ చెప్పారు. పొపాస్నా, లీమన్, స్వియాటోహిర్స్‌క్‌ సహా 15కు పైగా నగరాలు దాదాపుగా తమ చేతికి చిక్కాయన్నారు. డొనెట్స్‌క్‌లో సగం ప్రాంతం రష్యా చేతుల్లోకి వెళ్లిపోయిందని ఉక్రెయిన్‌ కూడా అంగీకరిస్తోంది. ఈ ఎదురుదెబ్బలకు కుంగిపోవొద్దని డోన్బాస్‌వాసులకు పిలుపునిచి్చంది. వీధి పోరాటాలతో రష్యా సైన్యానికి నరకం చూపిస్తున్నామని పేర్కొంది. కోల్పోయిన ప్రతి అంగుళాన్నీ తిరిగి స్వాదీనం చేసుకుంటామని ప్రకటించింది.

ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాలు ఇప్పటికే తమ గుప్పెట్లోకి వచ్చాయని రష్యా చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పు ఉక్రెయిన్‌కు మరింత సైన్యాన్ని తరలిస్తోంది. పశి్చమ దేశాలు అందించిన పలు అత్యాధునిక ఆర్టిలరీ వ్యవస్థలను క్షిపణి దాడులతో ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా తాను తాజాగా అందించిన అత్యాధునిక మలి్టపుల్‌ రాకెట్‌ లాంచర్ల వాడకంపై ఉక్రెయిన్‌ సైన్యానికి శిక్షణ మొదలు పెట్టింది. పశి్చమ దేశాల ఆంక్షలు రష్యాను పెద్దగా కుంగదీయలేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వాపోయారు. ఆఫ్రికా దేశాలకు ఆహార ధాన్యాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఈ విషయంలో తుర్కియే తదితర యూరప్‌ దేశాలు భద్రతా హామీలివ్వాలని కోరారు. 

తెరుచుకున్న థియేటర్‌ 
మూడు నెలలకు పైగా యుద్ధంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో నాటక ప్రదర్శనలకు ప్రఖ్యాతి చెందిన పోదిల్‌ థియేటర్‌ తెరుచుకుంది. ఆదివారం నుంచి జరుగుతున్న తొలి మూడు నాటక ప్రదర్శనలు హౌస్‌ఫుల్‌ అయ్యాయి కూడా! 

అమెరికా చేతికి లగ్జరీ విమానాలు, పడవ 
మరోవైపు, రష్యా కుబేరుడు రోమన్‌ అబ్రమోవిచ్‌కు చెందిన రెండు లగ్జరీ జెట్‌ విమానాలను అమెరికా స్వా«దీనం చేసుకుంది. అలాగే 32.5 కోట్ల డాలర్లు చేసే అతి విలాసవంతమైన పడవ అమెడాను కూడా జప్తు చేసుకుంది. 

మరిన్ని వార్తలు