భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్‌.. సూసైడ్‌ బాంబర్‌ అరెస్ట్‌!

22 Aug, 2022 14:34 IST|Sakshi

మాస్కో: భారత్‌లో దాడులు చేపట్టేందుకు ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఓ కీలక ఉగ్రవాదిని రష్యా బలగాలు పట్టుకున్నాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడే ఉద్దేశంతో భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐఎస్‌ఐఎస్‌ టెర్రరిస్టును పట్టుకున్నట్లు ప్రకటించింది రష్యాకు చెందిన ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌(ఎఫ్‌ఎస్‌బీ). భారత ప్రభుత్వంలోని కీలక నేతపై దాడి చేసేందుకు ఉగ్రవాది పతకం రచించినట్లు పేర్కొంది. 

‘ రష్యాలో నిషేధించిన ఇస్లామిక్‌ స్టేట్‌ టెర్రరిస్టును రష్యన్‌ ఫెడరేషన్‌కు చెందిన ఎఫ్‌ఎస్‌బీ గుర్తించి అదుపులోకి తీసుకుంది. సెంట్రల్‌ ఆసియా ప్రాంతంలోని ఓ దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించింది. ఆ ఉగ్రవాది భారత్‌లోని ప‍్రభుత్వానికి చెందిన ఓ కీలక నేత లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేసే ప్రణాళికతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.’ అని పేర్కొన‍్నారు రష్యా అధికారులు. ఇస్లామిక్‌ స్టేట్ ఆమిర్‌కు విధేయతతో ఉంటానని ఆ ఉగ్రవాది ప్రమాణం చేసినట్లు తెలిపారు. ఆ తర్వాతే  హైప్రొఫైల్‌ ఉగ్రదాడికి పాల్పడేందుకు భారత్‌ వెళ్లేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలు చేపట్టినట్లు తెలిసిందన్నారు. సూసైడ్‌ బాంబర్‌ను ఐఎస్‌ఐఎస్‌ టర్కీలో తమ సంస్థలో చేర్చుకున్నట్లు పేర్కొంది ఎఫ్‌ఎస్‌బీ.

ఇదీ చదవండి: అరెస్టు చేసే క్రమంలో నిందితుడి పై దాడి: వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు