అందుకేనా! రష్యా భారత్‌ చమురు మార్కెట్‌ వైపే మొగ్గు చూపుతోంది

1 Mar, 2023 12:19 IST|Sakshi

రష్యా చమురుకు చైనా నుంచి డిమాండ్‌ పెరుగుతన్నప్పటికీ.. భారత్‌కే వీలైనంత ఎక్కువగా విక్రయించేందుకు మొగ్గు చూపుతుంది. అదీగాక రష్యాకి కూడా మరింత లాభదాయకంగా ఉండటంతో  భారత్‌ మార్కట్‌ వైపే ఆసక్తి కనబరుస్తోంది. వాస్తవానికి ఒక ఏడాది క్రితం దాదాపుగా రష్యా చమురును భారత్‌ కొనుగోలు చేయలేదు. కానీ ఎప్పుడైతే అమెరికా, యూరోపియన్‌ దేశాలు ఉక్రెయిన్‌ యుద్ధ విషయమై రష్యాపై ఆంక్షలు విధించాయో అప్పుడే భారత్‌ రష్యాకి కీలకమైన మార్కెట్‌గా మారింది. గత ఫిబ్రవరిలో భారత్‌ రష్యా నుంచి రోజుకు 1.85 మిలియన్‌ బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది. అంటే దాని సంభావ్య గరిష్ట స్థాయి దాదాపు 2 మిలియన్‌ బ్యారెల్స్‌కు దగ్గరగా ఉంటుందని ప్రధాన ముడి విశ్లేషకుడు విక్టర్‌ కటోనా వివరించారు.

ప్రస్తుతం చైనా కరోనా ఆంక్షలను ఎత్తేసింది. పైగా మొత్తం రష్యా చమురు ఎగుమతులను చైనా కొనుగోలు చేయగలదు కూడా అయినప్పటికీ రష్యా భారత్‌ మార్కెట్‌నే కొనసాగించాలని ఫిక్స్‌ అయ్యింది. ఎందుకంటే భారత్‌ దాని ముడి విక్రయితలకు ఎక్కువ నియంత్రణ ఇస్తుంది. ఇదిలా ఉండగా..అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) ప్రకారం..గత నెలలో, రష్యా చైనాకు రోజుకు 2.3 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును ఎగుమతి చేసింది. మహమ్మారి సమయంలో విధించిన ప్రయాణ ఆంక్షలు ముగిసిన తర్వాత ఈ ఏడాది ఆసియా దిగ్గజం చమురు డిమాండ్ రోజుకు సుమారు 9 లక్షల బ్యారెల్స్ పెరుగుతుందని ఐఈఏ అంచనా వేసింది. చైనా రష్యా ముడి చమురును కొనుగోలు చేయగలగడమే గాక సొంతంగా షిప్పింగ్‌ చేయగల సామర్థ్యాం కూడా ఉంది. 

 ఐతే భారత్‌కి సరఫరా చేయడానికి స్థాపించిన ట్యాంకర్ల సమాంతర గ్రే ఫ్లీట్ నుంచి మాస్కో ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని అందువల్లే భారత్‌ ప్రయారిటీ ఇస్తోందని విక్టర్‌ కటోనా చెబుతున్నారు. అదీగాక భారత్‌కి ఓడరేవుల ద్వారా చమురు సరఫరా కేవలం 35 రోజులు పడుతుండగా చైనాకి సుమారు 40 నుంచి 45 రోజుల వరకు పడుతుంది. అంతేగాదు పెద్ద మొత్తంలో రష్యా చమురును ఉత్పత్తి చేసే రోన్‌సెఫ్ట్‌ పీజేఎస్‌ నయా ఎనర్జీ లిమిటెడ్‌లో 49.31% వాటాను కలిగి ఉంది. దీనికి సంబంధించిన షిప్పింగ్‌ రిఫెనరీ గుజరాత్‌లోని వదినార్‌లో ఉంది. ఇదే భారత్‌కు ఉన్న రెండోవ అతిపెద్ద వెసులుబాటు కావడంతో రష్యా భారత్‌కే విక్రయించేందుకు ఆసక్తి చూపుతోంది.

(చదవండి: నిందితుడి అతితెలివి: పోలీసులకు చిక్కుకుండా కొరియన్‌లా సర్జరీ! కానీ..)

మరిన్ని వార్తలు