తప్పు సరిదిద్దుకోలేదు.. వికీపీడియా ఓనర్‌కు భారీ షాక్‌ ఇచ్చిన రష్యా

13 Apr, 2023 18:21 IST|Sakshi

మాస్కో: ఆన్‌లైన్‌ ఎన్‌క్లోపీడియాగా పేరున్న వికీపీడియాకు రష్యా భారీ షాక్‌ ఇచ్చింది. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో ఫేక్‌ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందన్న అభియోగాలను మాస్కో కోర్టు ధృవీకరించింది.  ఈ మేరకు వికీపీడియా ఓనర్‌ అయిన వికీమీడియా ఫౌండేషన్‌కు 2 మిలియన్ల రూబుల్స్‌(24 వేల డాలర్లపైనే.. మన కరెన్సీలో 20 లక్షల రూపాయలకు పైమాటే) జరిమానా విధించింది. 

ఉక్రెయిన్‌లో రష్యా మిలిటరీ వ్యవహారాలకు సంబంధించిన తప్పుడు సమాచారం తొలగించని కారణంగానే ఈ జరిమానా విధిస్తున్నట్లు మాస్కో కోర్టు  తన ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. స్వతంత్ర సమాచారం పేరిట వికీపీడియాలో సమాచారం పొందుపరుస్తుండడంపై రష్యా తీవ్ర అసహనంతో ఉంది. ఈ క్రమంలో వికిపీడియాకు జరిమానాల మీద జరిమానాలు విధిస్తూ వెళ్తోంది. అయితే.. 

వికీమీడియా మాత్రం వికీపీడియా స్టాండర్స్‌కు తగ్గట్లుగానే, పక్కా సమాచారన్ని పొందుపరుస్తున్నట్లు చెబుతూ వస్తోంది. 

మరిన్ని వార్తలు