Ukraine Russia War: 31,000 రష్యా సైనికుల మృతి

8 Jun, 2022 07:48 IST|Sakshi

Russia has Lost Over 31000 Soldiers in Ukraine: ఉక్రెయిన్‌ యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల సంఖ్య 31 వేలు దాటినట్టు సమాచారం. తాజాగా వ్లాదిమిర్‌ నిగ్మతులిన్‌ (46) అనే కల్నల్‌ మరణించడంతో యుద్ధంలో బలైన రష్యా కల్నల్స్‌ సంఖ్య 50కి చేరింది.

మేజర్‌ జనరల్‌ రోమన్‌ కుజుతోవ్, లెఫ్టినెంట్‌ జనరల్‌ బెర్డ్‌నికోవ్‌ మరణంతో యుద్ధానికి బలైన రష్యా జనరళ్ల సంఖ్య 12కు చేరింది. మరోవైపు వాగ్నర్‌ గ్రూప్‌కు చెందిన వ్లాదిమిర్‌ ఆండొనోవ్‌ (44) అనే రష్యా కిరాయి సైనికున్ని ఉక్రెయిన్‌ స్నైపర్లు మట్టుబెట్టారు. ఇతను క్రిమియా యుద్ధమప్పుడు ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలకు నరకం చూపించి ‘తలారి’గా పేరుమోశాడు. 

చదవండి: (దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేసిన... గుప్తా బ్రదర్స్‌ చిక్కారు)

మరిన్ని వార్తలు