Russia - Britain: రష్యాకు ఆ నైతిక హక్కు లేదు.. జెలెన్‌స్కీ అన్ని విధాల అర్హుడు!

20 Aug, 2022 08:05 IST|Sakshi

లండన్‌: రష్యాపై బ్రిటన్‌ సంచలన విమర్శలకు దిగింది. ఉక్రెయిన్‌పై మారణ హోమం దరిమిలా.. ప్రపంచ దేశాల సరసన కూర్చునే అర్హతను కోల్పోయిందంటూ విమర్శించింది. 

ఈ ఏడాది నవంబర్‌లో జీ20 సదస్సు ఇండోనేషియాలో జరగనుంది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సైతం హాజరు కానున్నట్లు ప్రకటించింది ఇండోనేషియా విదేశాంగ శాఖ. అయితే.. 

ఈ ఇద్దరి హాజరుపై మొదటి నుంచే పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా.. ఉక్రెయిన్‌పై యుద్ధంతో వేల మంది ప్రాణాలను బలితీసుకుని.. లక్షల మంది ప్రాణ భయంతో వలస జీవులుగా మార్చిన పుతిన్‌ను ఆహ్వానించడంపై బ్రిటన్‌ మండిపడుతోంది. ‘ఉక్రెయిన్‌ నరమేధంతో జీ20లో కూర్చునే నైతిక హక్కును రష్యా కోల్పోయింది’ అంటూ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు బ్రిటన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ. 

‘‘రష్యా యుద్ధాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఇండోనేషియా ప్రకటించడం హర్షనీయం. అలాగే.. ఈ సదస్సుకు రష్యా బదులు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీని ఆహ్వానించడం అన్ని విధాల అర్హనీయం. ఒకవైపు యుద్ధం కొనసాగిస్తూనే.. శాంతి స్థాపన కోసం జెలెన్‌స్కీ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆయన ప్రపంచం దృష్టిలో ఒక హీరోగా నిలిచారు’’ అని బ్రిటన్‌ ప్రకటన పేర్కొంది. 

ఇదీ చదవండి: అప్పుడు స్టాలిన్‌.. ఇప్పుడు పుతిన్‌!!

మరిన్ని వార్తలు