Russia Military Drills: అగ్రరాజ్యం ఆంక్షలకు చెక్‌పెట్టేలా... రష్యా యుద్ధ విన్యాసాలు

1 Sep, 2022 12:43 IST|Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌ పై దురాక్రమణ యుద్ధానికి దిగినందుకు అమెరికా రష్యాని ఒంటరి చేసేలా ఆర్థిక ఆంక్షలు విధించింది. దీంతో ఆగ్రహంతో ఉన్న రష్యా ఆ చర్యలన్ని తిప్పికొట్టే ఎత్తుగడను తెరపైకి తీసుకువచ్చి మరీ అమలు చేస్తోంది. అమెరికా ఎత్తు పారనీయకుండా రష్యా అట్టహాసంగా యుద్ధ విన్యాసాలకు సిద్ధమైంది. అందుకోసం భారత్‌, చైనాలను రష్యాకు తీసుకువచ్చింది. ఈ మేరకు తూర్పు తీర ప్రాంతాల తోపాటు జపాన్‌ సముద్ర జలాల్లో  గురువారం వోస్టాక్‌-2022 యుద్ధవిన్యాసాలను ప్రారంభించనుంద.  

వారం రోజుల పాటు ఈ విన్యాసాలను నిర్వహించనున్నారు. ఈ సైనిక కసరత్తుల్లో సుమారు 50 వేలకు పైగా బలగాలు, దాదాపు 140కి పైగా యుద్ధ విమానాలు, 60 యుద్ధనౌకలతో సహా దాదాపు 5 వేల సైనిక సామాగ్రిని వినియోగించనున్నారు. ఈ సాధారణ సైనిక కసరత్తులు రష్యా నేతృత్వంలోని మాజీ సోవియట్‌ దేశాలకు చెందిన సభ్యదేశాల భాస్వాములను ఒక చోటకు చేరుస్తాయి. ఈ ఆర్మి డ్రిల్‌లో పాల్గొనేందుకు న్యూఢిల్లీ సుమారు 75 మందితో కూడిన చిన్న సైనిక బృందాన్ని పంపుతోంది. ఈ బృందంలో గుర్ఖా దళాలు, నౌకదళం, వైమానికి దళం నుంచి ప్రతినిధులు ఉన్నారు.

అయినప్పటికీ భారత్‌ నావికా లేదా వైమానిక సామాగ్రిని రష్యాకు పంపడం లేదు. భారత్‌కి చైనా, పాకిస్తాన్‌లతో ఉన్క సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధాల కోసం రష్యా పై ఆధారపడటంతో గతంలో రష్యాలో ఈ సైనిక విన్యాసాలకు హాజరైంది. ఎప్పుడైతే ఉక్రెయిన్‌ యుద్ధ విషయంలో రష్యా అనుసరిస్తున్న తీరుతో కాస్త దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగా భారత్‌ రష్యాతో సంయుక్తంగా ఉత్పత్తి చేసే హెలికాప్టర్ల ఎత్తుగడను సైతం విరమించుకుంది.

అలాగే మరో 30 యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రణాళికను సైతం నిలిపేసింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌ విషయమై రష్యాను విమర్శించడానికి ముందుకు రాలేదు చైనా. సుదీర్ఘ యుద్ధ కారణంగా యూఎస్‌, పశ్చిమ దేశాలు రష్యాపై మరోసారి ఆంక్షల మోత మోగించే అవకాశం ఉన్నందున చైనా రష్యాకు మద్దతు ఇచ్చిన సాంకేతికత, సైనిక సామాగ్రిని అందజేసింది.

ఐతే మాస్కో మాత్రం చైనా పాత్రను రష్యాకు మద్దతుగా పరిగణించలేమని రష్యా సైనికుడు వాసిలీ కాషిన్‌ అన్నారు. దీన్ని తాము మిలటరీ సంబంధాలుగానే కొనాసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ వోస్టాక్‌ 2022 యుద్ధ విన్యాసాల్లో మాజీ సోవియట్‌ రిపబ్లిక్‌ దేశాలైన కజకిస్తాన్‌, కిర్గిస్తాన్‌, అర్మేనియా, అజర్‌బైజాన్‌, తజకిస్తాన్‌, సిరియా, అల్జీరియా, మంగోలియా, లావోస్‌, నికార్గావ్‌ తోపాటు రష్యా మిత్రదేశమైన బెలారస్‌ కూడా పాల్గొంటుంది. 

(చదవండి: రష్యా సుమారు 50 వేల బలగాలతో సైనిక విన్యాసాలు... టెన్షన్‌లో యూఎస్‌)

మరిన్ని వార్తలు