భారత్‌పై కాట్సా.. బైడెన్‌దే నిర్ణయం

4 Mar, 2022 09:29 IST|Sakshi

వాషింగ్టన్‌: అధునాతన సైనిక సంపత్తిని సమకూర్చుకోవాలన్న భారత్‌ ప్రయత్నాలకు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు అడ్డుకట్ట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాతోపాటు, దాని సన్నిహిత దేశాలపై పలు ఆంక్షలు విధిస్తున్న అమెరికా చూపు.. రష్యా నుంచి ఎస్‌–400 క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న భారత్‌పై పడింది. కాట్సా ఆంక్షలను కీలక భాగస్వామిగా ఉన్న భారత్‌పై వర్తింప జేసే విషయంలో అధ్యక్షుడు బైడెన్‌దే తుది నిర్ణయమని అమెరికా ఉన్నతాధికారి ఒకరు గురువారం తెలిపారు.

ప్రస్తుత సమయంలో భారత్‌ రష్యాకు మరింత దూరంగా ఉండాలన్నారు. ఇప్పటికే రష్యాతో కుదుర్చుకున్న మిగ్‌–29, రష్యన్‌ హెలికాప్టర్లు, ట్యాంక్‌ విధ్వంసక ఆయుధాల కొనుగోలు ఒప్పందాలను భారత్‌ రద్దు చేసుకుందని చెప్పారు. ఇరాన్, ఉత్తరకొరియా, రష్యా దేశాలపై చెప్పుకోదగ్గ స్థాయిలో లావాదేవీలు నెరిపే దేశాలపై కౌంటరింగ్‌ అమెరికా యాడ్వర్సరీస్‌ థ్రూ శాంక్షన్స్‌ యాక్ట్‌(కాట్సా)ను ప్రయోగిస్తుంది. ఈ చట్టంతో రష్యా నుంచి రక్షణ రంగ కొనుగోళ్లు చేపట్టే దేశాలపై కఠినమైన ఆంక్షలు అమలవుతాయి. 

(చదవండి: రష్యా దళాలకు చెక్‌.. ఆ దిశగా ముందుకు సాగుతున్న అమెరికా బలగాలు)

>
మరిన్ని వార్తలు