ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్ అదృశ్యం.. రష్యా పనే!

12 Oct, 2022 17:28 IST|Sakshi

కీవ్‌: జపోరిజజియా అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్‌ వలెరియ్‌ మార్టిన్‌యుక్‌ను రష్యా కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. ఆయనను ఎక్కడ నిర్బంధించి ఉంచారో తెలియడం లేదని పేర్కొంది.  ట్రేస్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయింది. ఈమేరకు ఉక్రెయిన్ అణు విద్యుత్ నిర్వహణ సంస్థ ఎనర్జోఆటం మీడియాకు వెల్లడించించి.

అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చీఫ్‌ రఫేల్ గ్రాస్‌ను ఈ విషయంపై సంప్రదిస్తున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది. మరోవైపు రష్యా రక్షణమంత్రి కూడా ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు.

అయితే ఐరోపాలోనే అతిపెద్దదైన ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా కొద్ది రోజుల క్రితమే ఆక్రమించుకుంది. ఆ తర్వాత దీని చీఫ్‌ను అక్టోబర్‌ 1 నిర్భంధించింది. అనంతరం అక్టోబర్ 3న విడుదల చేసింది. కానీ ఆ తర్వాత రోజు నుంచి అతడు విధులకు హాజరుకావడం లేదు. అణువిద్యుత్ కేంద్రం రష్యా గుప్పిట్లోనే ఉన్నప్పటికీ దీన్ని ఉక్రెయిన్ సిబ్బందే నిర్వహిస్తున్నారు.
చదవండి: ఉక్రెయిన్‌ కోసం కాదు.. అందుకైతే పుతిన్‌ను కలుస్తా

మరిన్ని వార్తలు