మళ్లీ తీవ్రమవుతున్న రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం !

8 Jan, 2024 16:00 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా తాజాగా మరోసారి బాంబుల వర్షం కురిపించింది. సోమవారం ఉదయం జరిగిన ఈ దాడులు నివాసాలతో పాటు  పరిశ్రమల భవనాలు లక్ష్యంగా సాగాయి. ఈ దాడుల్లో పలువురు పౌరులు గాయపడ్డారు. ‘శత్రువు ప్రశాంత ప్రదేశాలను కూడా వదిలిపెట్టడం లేదు’అని దేశంలోని ప్రధాన పట్టణం కీవ్‌ మేయర్‌ తెలిపారు.

‘రష్యన్లు దేనిని టార్గెట్‌ చేస్తున్నారో తెలియడం లేదు. ఈ దాడుల్లో పారిశ్రామిక వాడలు లక్ష్యంగా మిసైళ్లు పేల్చారు’అని కార్కివ్‌ మేయర్‌ తెలిపారు. మరోవైపు సోమవారం ఉక్రెయిన్‌ జరిపిన దాడుల కారణంగా తమ తమ దేశంలోని బెల్గార్డ్‌ పట్టణంలోని 300 మంది స్థానికులను అక్కడి నుంచి వేరే ప్రదేశాలకు తరలించినట్లు రష్యాలోని బెల్గార్డ్‌ గవర్నర్‌ తెలిపారు. బెల్గార్డ్ పట్టణం ఉక్రెయిన్‌ సరిహద్దులోనే ఉండటం గమనార్హం.     

2022 ఫిబ్రవరి 14న ప్రారంభమైన రెండవ దశ రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం అప్పటి నుంచి కొనసాగుతోంది. నిజానికి ఉక్రెయిన్‌ భూ భాగంపై వెళుతున్న మలేషియన్‌ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కూల్చివేసిన తర్వాత  2014లోనే  రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య తొలిదశ  యుద్ధం ప్రారంభమైంది.  రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యూరప్‌ దేశంపై సుదీర్ఘ దాడి జరగడం ఇదే తొలిసారని పరిశీలకులు చెబుతున్నారు. 

ఇదీచదవండి..అమెరికాలో రోడ్డు ప్రమాదం ఖమ్మం యువకుడు మృతి 

>
మరిన్ని వార్తలు