పుతిన్‌తో ఇంటర్వ్యూ: ‘డ్రెస్‌ ఏంటి.. నీ ఎక్స్‌ప్రెషన్స్‌కి అర్థం ఏంటి?’

19 Oct, 2021 13:42 IST|Sakshi

అమెరికన్‌ న్యూస్‌ రిప్రజెంటర్‌ చర్యలపై రష్యా మీడియా ఆగ్రహం

పుతిన్‌ని ట్రోల్‌ చేస్తున్న నెటిజనులు

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌, సీఎన్‌బీసీ న్యూస్‌ రిప్రజెంటర్‌ను ఉద్దేశించి అందంగా ఉంది.. ప్రెట్టీగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. పుతిన్‌ వ్యాఖ్యలపై నెటిజనులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రష్యా మీడియా ఎదురుదాడి ప్రారంభించింది. సదరు న్యూస్‌ రిప్రెజెంటరే పుతిన్‌ని డిస్టర్బ్‌ చేయాలని భావించింది.. ఆమె బాడీ ఎక్స్‌ప్రెషన్స్‌,  డ్రెస్‌ చూస్తే.. పుతిన్‌కి సిగ్నల్‌ ఇచ్చినట్లే ఉందని ఎదురుదాడికి దిగింది. రష్యా మీడియాపై నెటిజనుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రధాని మరీ అంత బలహీన మనస్తత్వం కలవాడా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదానికి ఆజ్యం పోసిన సంఘటన వివరాలు..

మాస్కోలోని ఎనర్జీ ఫోరమ్‌లో రష్యన్ ప్రధాని వ్లాదిమర్‌ పుతిన్‌ పాల్గొన్న సెషన్‌కు సీఎన్‌బీసీ ఉద్యోగి హాడ్లీ గ్యాంబుల్ మోడరేటర్‌గా ఉన్నారు. యూరోప్‌లో ఏర్పడ్డ గ్యాస్ సంక్షోభం గురించి జరిగిన సెషన్‌లో పుతిన్‌ ఆమెను ఉద్దేశించిన అందంగా ఉంది.. ప్రెట్టీగా ఉందని ప్రశంసించాడు. పుతిన్‌ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. వ్యవహారం కాస్త ముదురుతుండటంతో పుతిన్ ప్రచారకుడు వ్లాదిమిర్ సోలోవియోవ్ రంగంలోకి దిగారు. 


(చదవండి: రష్యాకు ఊహించని దెబ్బ.. భారత్‌లో పడిపోయిన డిమాండ్‌)

సోలోవియోవ్ తన రోసియా 1 న్యూస్ ఛానల్‌లో హాడ్లీ గ్యాంబుల్‌, పుతిన్‌ మధ్య జరుగుతున్న సంభాషణకు సంబంధించిన వీడియోను టెలికాస్ట్‌ చేశాడు. దీనిలో గ్యాంబుల్‌, పుతిన్‌ 'దృష్టి మరల్చడానికి' అన్ని విధాలుగా ప్రయత్నించిందని ఆరోపించాడు. ఫుటేజ్‌లో ప్రధానంగా ఆమె కాళ్లపై దృష్టి పెట్టాడు. పుతిన్‌తో మాట్లాడుతున్నప్పుడు హాడ్లీ తన కాళ్లను ముందుకు వెనక్కి ఊపుతూ ఉంటుంది. హాడ్లీ చర్యలపై రష్యా మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘హాడ్లీ ఈ పనుల ద్వారా  తనను తాను ఒక సెక్స్‌ ఆబ్జెక్ట్‌గా ప్రదర్శించుకుంది. పుతిన్‌ దృష్టిని మరల్చాలని విఫల యత్నం చేసింది’’ అంటూ మండిపడుతుంది. 

ఈ దుమారంపై సీఎన్‌బీసీ కానీ, గ్యాంబ్లర్‌ కానీ స్పందించలేదు. కానీ గ్యాంబ్లర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పుతిన్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా తీసిన ఓ ఫోటోని పోస్ట్‌ చేసి.. ‘నా ఫేవరెట్‌ యాంగిల్‌’ అని పేర్కొంది. దీనిలో ఆమె కాలు పుతిన్‌ వైపు చాపినట్లు ఉంది. 
(చదవండి: రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యం విషమం.. ‘ఏ క్షణంలోనైనా మృతి’)

ఇక రష్యా మీడియా, పుతిన్‌ వ్యాఖ్యలపై అమెరికన్‌ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అంటే జర్నలిస్ట్‌ అన్న వాడు మీ ఇంటర్వ్యూని శ్రద్ధగా వినాలని రూల్‌ ఏమైనా ఉందా.. వినకపోవడం ఏమైనా అమర్యాదకర చర్యా’’.. ‘‘పుతిన్‌ వ్యాఖ్యలు చూస్తే.. పిరికివాడు తన అనుచిత ప్రవర్తనను కప్పిపుచ్చుకునే విధంగా ఉన్నాయి. అక్కడ ఓ మగ జర్నలిస్ట్‌ ఉంటే పుతిన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడా’’ అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. 

చదవండి: పుతిన్‌ కండబలం

మరిన్ని వార్తలు