అణు యుద్ధం ముప్పు పెరుగుతోంది: పుతిన్‌

8 Dec, 2022 13:20 IST|Sakshi

మాస్కో: అణ్వాయుధాల వినియోగంపై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. ప్రస్తుతం అణు యుద్ధం ముప్పు పెరుగుతోందని, అయితే, తాము అణ్వాస్త్రాలను వినియోగించబోమని పేర్కొన్నారు. రష్యాలోని మానవ హక్కుల మండలితో వర్చువల్‌గా మాట్లాడారు పుతిన్‌.  ఈ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాపై పరోక్ష విమర్శలు చేశారు.  

‘ఉక్రెయిన్‌లో యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్న ప్రక్రియ. అణు యుద్ధం ముప్పు పెరుగుతోందనడంలో అనుమానాలు లేవు. ఏ పరిస్థితిలోనూ రష్యా మొదట అణ్వాయుదాలను ప్రయోగించదు. వాటిని చూపించి బెదిరించదు. అణ్వాయుధాల సంగతి మాకు తెలుసు. అందుకే ఉన్మాదంగా వ్యవహరించబోం. ప్రపంచమంతా తిరుగుతూ ఆ ఆయుధాలను బ్రాండింగ్‌ చేసుకోం. ప్రపంచంలోనే అత్యాధునిక అణ్వాస్త్రాలు రష్యా వద్ద ఉన్నాయి. ఇతర దేశాల భూభాగాలపై మా అణ్వాయుధాలు లేవు.’ అని పేర్కొన్నారు పుతిన్‌. టర్కీ, ఇతర ఐరోపా దేశాల్లో అమెరికాకు చెందిన న్యూక్లియర్‌ బాంబ్స్‌ ఉండడాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కేవలం ‍ఆత్మ రక్షణకే రష్యా న్యూక్లియర్‌ వెపన్స్‌ వాడుతుందన్నారు. 

ఇదీ చదవండి: టైమ్స్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా జెలెన్‌స్కీ

మరిన్ని వార్తలు