ఏం చేయాలో మా బలగాలకు తెలుసు! ఉక్రెయిన్‌ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్‌

26 May, 2023 07:58 IST|Sakshi

ఉక్రెయిన్‌లో హత్యల జాబితాలో రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నంబర్‌ వన్‌ అని, అతను కిల్‌ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడంటూ ఉక్రెయిన్‌ మిలటరీ ఇంటిలిజెన్స్‌ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు రష్యా ఘాటుగా స్పందించింది. మా భద్రత బలగాలకు ఏం చేయాలో తెలుసని వారి పనేంటో కూడా వారికి తెలుసు అంటూ కౌంటరిచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ డిప్యూటీ హెడ్‌ వాడిమ్‌ స్కిబిట్క్సీ, ఓ పత్రిక ఇంటర్యూలో ఉక్రెయిన్‌.. పుతిన్‌ని చంపేయాలనుకుంటుదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసని,  ఉక్రెయిన్‌ హత్యల జాబితాలో తాను అగ్రస్థానంలో ఉన్నానని పుతిన్‌కి కూడా తెలుసని అన్నారు.

అతను చేస్తున్న చర్యలకు ఏదోఒక రోజు సమాధానం చెప్పవలసి ఉంటుందన్నారు. తాము అతన్ని సమీపిస్తున్నామని, తన సొంత వ్యక్తులచే చంపబడతాడనే భయం కూడా పుతిన్‌లో ఉందని స్కిబిట్స్కీ వ్యాఖ్యలు చేశాడు. అంతేగాదు తాము ఇతర రష్యన్లు లక్ష్యగా పెట్టుకున్నామని అందులో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, కిరాయి బాస్ యెవ్జెనీ ప్రిగోజిన్, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్, మిలిటరీ కమాండర్ సెర్గీ సురోవికిన్ తదితరులు ఉన్నారని చెప్పుకొచ్చాడు. పుతిన్‌ తన లక్ష్యం చేరుకోవడం అసాధ్యమని, చాలా సమయం తమ దళాలు రష్యాని నిలువరించాయిని స్కిబిట్స్కీ ధీమాగా చెప్పాడు.

ఇదిలా ఉండగా, ఈ విషయమై రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ని ఆరా తీసింది సదరు మీడియా. పుతిన్‌ను రక్షించే చర్యల ముమమ్మరం చేయనున్నారా అని పెస్కోవ్‌ని ప్రశ్నించింది. మమ్మల్ని నమ్మండి, మా భద్రత సేవలకు తాము ఏం చేయాలో తెలుసు, వారి పనేంటో కూడా తెలుసని సీరియస్‌ అయ్యారు.

సరిగ్గా 15 నెలల క్రితం ఉక్రెయిన్‌లో రష్యా ప్రత్యేక ఆపరేషన్‌ పేరుతో ప్రారంభించిన ఈ యుద్ధం సరైనదని స్కిబిట్స్కీ ఇంటర్యూ చెప్పకనే చెప్పిందని విమర్శించారు. ఒకరకంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ని సమర్థించబడటమే గాక అవసరమైన దానికంటే ఎక్కువ లక్ష్యాలను సాధించడం ద్వారా దాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు పెస్కోవ్‌. కాగా, ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాలు మాత్రం దీన్ని ఆక్రమణ యుద్ధంగా అభివర్ణిస్తున్నాయి. అంతేగాదు రష్యాపై జరిపిన డ్రోన్‌ దాడిని కూడా పుతిన్‌ చంపేందుకు ఉక్రెయిన్‌ పన్నిట కుట్రగా అభివర్ణించగా, కీవ్‌ మాత్రం ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం గమనార్హం.

(చదవండి: రాకెన్‌ రోల్‌ క్వీన్‌ ఇకలేరు)

మరిన్ని వార్తలు