'మిలిటరీ ఆపరేషన్' లక్ష్యం 'యుద్ధాన్ని ఆపడమే!: పుతిన్‌

8 Mar, 2022 09:51 IST|Sakshi

Goal Of Russias Military Operation: ఉక్రెయిన్‌ రష్యాల మధ్య సాగుతున్న నిరవధిక పోరు నేటికి 13వ రోజుకి చేరుకుంది. అయితే యూకేలో రష్యన్ రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లోని మిలటరీ ఆపరేషన్‌ లక్ష్యం యుద్ధాన్ని ఆపడమే అని రష్యా విదేశాంగ మంత్రి సెర్టీ విక్టోరోవిచ్‌ లావ్‌రోవ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై యునైటెడ్‌ స్టేట్స్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందిస్తూ..ఇది పచ్చి అబద్ధం అని ఖండించారు.

అంతేకాదు అప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌లోని రష్యన్ మాట్లాడే వర్గాలను రక్షించడమే లక్ష్యంగా 'మిలిటరీ ఆపరేషన్' అని పేర్కొన్నారు. పైగా రష్యాను బెదిరించడానికి ఉక్రెయిన్‌ను ఉపయోగించకుండా నిరోధించడం అని కూడా చెప్పారు. కానీ పశ్చిమ దేశాలు పుతిన్‌ వాదనను యుద్ధానికి నిరాధారమైన సాకుగా అభివర్ణించాయి. కానీ ఇప్పుడేమో రష్యా ఎంబసీ ఉక్రెయిన్‌ భూభాగంలో జరిగే యుద్ధాన్ని ఆపేందుకే ప్రత్యేక మిలటరీ ఆపరేషన్‌ అంటూ సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చింది.

అయితే అమెరికా నేతృత్వంలోని నాటో ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించడమే కాక మాస్కో దురాక్రమణకు అడ్డుకట్టవేసేలా ఆర్థిక ఆంక్షలు కూడా విధించింది. మరోవైపు రష్యా సాయుధ బలగాలు రాజధాని కైవ్‌ని సోంతం చేసుకుంటాం లొంగిపోండి అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని బెదిరించడమే కాక ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల బాంబుల వర్షంతో విరుచుకుపడింది. ఈ యుద్ధ విధ్వసం కారణంగా సుమారు 331 మందికి పైగా పౌరులు మరణించినట్లు యూఎన్‌ మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది.

(చదవండి:  ఓవైపు యుద్ధం.. మరోవైపు తరలింపు!! రష్యా-ఉక్రెయిన్‌ చెరోమాట)

మరిన్ని వార్తలు