భారతీయ విద్యార్థుల కోసం 130 బస్సులు

4 Mar, 2022 11:26 IST|Sakshi

మాస్కో: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్, సుమీ నగరాల్లో చిక్కుబడి పోయిన భారతీయులు సహా విదేశీ విద్యార్థులను తమ దేశంలోని బెల్గోరోడ్‌ రీజియన్‌కు సురక్షితంగా తీసుకువచ్చేందుకు 130 బస్సులను పంపను న్నట్లు రష్యా సైనిక ఉన్నతాధికారి ఒకరు గురువారం తెలిపారు. ఉక్రెయిన్‌లోని సంక్షోభ ప్రాంతాల్లో చిక్కుబడిపోయిన భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు తగు ఏర్పాట్లు చేయాలంటూ భారత ప్రధాని మోదీ బుధవారం అధ్యక్షుడు పుతిన్‌ను కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా సైనికాధికారి కల్నల్‌–జనరల్‌ మిఖాయిల్‌ మిజిన్‌ట్సెవ్‌ తెలిపారు. ఈ బస్సులు బెల్గోరోడ్‌లోని నెఖొటెయ్‌వ్కా, సుడ్‌జా చెక్‌పాయింట్ల నుంచి ఖర్కీవ్, సుమీలకు వెళతాయని ఆయన చెప్పినట్లు అధికార టాస్‌ వార్తా సంస్థ వెల్లడించింది. తిరిగి వచ్చాక చెక్‌పాయింట్ల వద్ద నుంచి తమ సైనిక విమానాల్లో గమ్యస్థానాలకు చేరుస్తామన్నారు. 

(చదవండి: స్వదేశానికి మరో 798 మంది భారతీయులు)

మరిన్ని వార్తలు