పుతిన్‌ షాకింగ్‌ నిర్ణయం! యూఎస్‌కి ఊహించని ఝలక్‌

21 Feb, 2023 18:43 IST|Sakshi

ఉక్రెయిన్‌పై దాడికి దిగి ఏడాది కావోస్తున్న సందర్భంగా పుతిన్‌ పార్లమెంట్‌లో రష్యాను ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ ప్రసంగం ముగిసే సమయంలో చట్ట సభ్యులతో ఒక షాకింగ్‌ నిర్ణయాన్ని వెల్లడించారు. రష్యా ప్రమాదకర వ్యూహాత్మక ప్రమాదకర ఆయుధాల ఒప్పందంలో యూఎస్‌తో తన భాగస్వామ్యాన్ని నిలిపేస్తేన్నట్లు ప్రకటించారు. ఇరుపక్షాల వ్యూహాత్మక అణ్వాయుధాలను పరిమితం చేసే న్యూ స్టార్ట్‌ ట్రిటీ(New START treaty) ఒప్పందంలో రష్యా తన భాగస్వామ్యన్ని నిలిపేస్తుందని పుతిన్‌ వెల్లడించారు.

వాస్తవానికి ఈ న్యూ స్టార్ట్‌ ట్రిటీ ఒప్పందంపై 2010లో ఇరు దేశాలు సంతకం చేశాయి. ఆ తర్వాత ఏడాదే ఇది అమల్లులోకి వచ్చింది. మళ్లీ 2021లో జో బైడెన్‌ పదవీ భాద్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఒప్పందం మరో ఐదేళ్ల పాటు పొడిగించడం జరిగింది. ఇది అమెరికా రష్యా వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌లను సంఖ్యను పరిమితం చేసేలా, భూమి, జలాంతర్గామీ ఆధారిత క్షిపణులు, బాంబులను మరింతగా విస్తరింప చేస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం..రష్యా వద్ద దాదాపు 6 వేల వార్‌హెడ్‌లతో ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధాల నిల్వ ఉన్నట్లు సమాచారం. అంతేగాదు రష్యా, అమెరికాలే వద్ద ప్రపంచంలోని 90% అణు వార్‌హెడ్‌లను కలిగి ఉన్నాయని, ఇవి ఒక గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయగలవని చెబుతున్నారు.

(చదవండి: యుద్ధాన్ని ప్రారంభించింది పశ్చిమ దేశాలే: పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు