కుప్పకూలిన రష్యా మిలటరీ రవాణా విమానం

25 Feb, 2022 08:22 IST|Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌ ప్రకటించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలసిందే. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే వందల సంఖ్యలో మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజాగా రష్యాకు చెందిన ఆంటోనోవ్ యాన్-26 మిలటరీ రవాణా విమానం ఉక్రెయిన్ సమీపంలో రష్యాలోని దక్షిణ వొరోనెజ్ ప్రాంతంలో కుప్పకూలినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

స్థానికి మీడియా కథనం ప్రకారం.. మిలిటరీ పరికరాలను రవాణా చేస్తుండగా రష్యన్ ఏరోస్పేస్ దళాలకు చెందిన ఏఎన్‌-26 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని సిబ్బంది మొత్తం మరణించారని, ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ ప్రమాదం ‍కారణంగా నేలపై ఎటువంటి విధ్వంసం జరగలేదని పేర్కొంది. విమాన ప్రమాదం జరిగినట్లు ధృవీకరించినప్పటికీ, అందులో ఎంత మంది మరణించారో చెప్పడానికి రక్షణశాఖ నిరాకరించింది. ఏఎన్‌-26 విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు 38 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం.

( చదవండి: రష్యాకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. ఆ దేశాల జోలికొస్తే ఖబడ్దార్‌ )

మరిన్ని వార్తలు