మళ్లీ ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్‌ చర్చలు... ఈసారి ఈయూ నాయకుల ఎంట్రీ

15 Mar, 2022 20:11 IST|Sakshi

Talks between Ukraine and Russia resumed: ఉక్రెయిన్‌ పై రష్యా పోరు సాగిస్తూనే ఉంది. వైమానికి క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌ని రూపు రేకలు తుడుచు పెట్టుకు పోయేలా రష్యా  దురాక్రమణకు యత్నిస్తోంది. ఆ దిశగా ఒక్కోక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ పౌరులు,  ఆసుపత్రుల పైన నిర్థాక్షిణ్యంగా దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కాల్పలు విరమణ, బలగాలు వెనక్కు మళ్లించే దిశగా రష్యా ఉక్రెయిన్‌ల మధ్య మళ్లీ చర్చలు పునః ప్రారంభమయ్యాయని ఉక్రెయిన్‌ ప్రతినిధి మైఖైలో పోడోల్యాక్ చెప్పారు.

అంతేకాదు మూడు యూరోపియన్‌ యూనియన్ దేశాల నాయకులు ఉన్నత అధికారులను కలవడానికి కైవ్‌కు వెళ్తున్నారు.  దీంతో కాల్పులు విరమణ నిమిత్తం ఉక్రెయిన్‌ రాజధానిలో 36 గంటల కర్ఫ్యూ విధించిందని తెలిపారు. ఉక్రెయిన్ స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం యూరోపియన్ యూనియన్ నిస్సందేహమైన మద్దతును వ్యక్తపరచడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం అని చెక్ ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా ట్విట్టర్‌లో తెలిపారు.

ఈ పర్యటనలో స్లోవేనియాకు చెందిన జానెజ్ జాన్సా, పోలాండ్‌కు చెందిన మాటెస్జ్ మోరావికీ, పోలాండ్ యొక్క వాస్తవాధీన నాయకుడైన జరోస్లావ్ కాజిన్స్కీతో కలిసి ఉక్రెయిన్‌ పర్యటనకు వచ్చారు. ఈ భీకరమైన యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన శరణార్థుల సంక్షోభాన్ని సృష్టించి, వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న దురాక్రమన దాడి నేటికి 20 రోజుకి చేరుకుంది.

(చదవండి: యుద్ధానికి రష్యా గుడ్‌ బై చెప్పనుందా?.. అదే కారణమా?)

మరిన్ని వార్తలు