Ukraine: ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు.. కీవ్‌ను తక్షణమే వీడండి: భారత ప్రభుత్వం

1 Mar, 2022 12:30 IST|Sakshi

ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలపై భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం మరింత తీవ్రతరం కావడంతో.. రాజధాని కీవ్‌లో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని, తక్షణమే కీవ్‌ను వీడాలని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. 

రష్యా బలగాలు భారీగా కీవ్‌ నగరం వైపుగా కదులుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రైళ్లు, ఇతర మార్గాల ద్వారా అత్యవసరంగా కీవ్‌ నుంచి బయటపడాలని భారత పౌరులకు(విద్యార్థులతో సహా) ఎంబసీ ద్వారా సూచించింది కేంద్ర ప్రభుత్వం. పరిస్థితి ఏ క్షణం ఎలాగైనా మారొచ్చని.. జాగ్రత్తగా సరిహద్దులకు చేరాలని ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు ఉక్రెయిన్‌లోని పౌరులను తక్షణమే తరలించేలా సీ-17 విమానాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. త్వరగతిన తరలింపు ప్రక్రియను కొనసాగించాలని అనుకుంటోంది. మరోవైపు అమెరికా సహా పలు దేశాలు కీవ్‌లోని రాయబారులను తరలించింది.

మరిన్ని వార్తలు