అర్జెంటీనాకి తరలిపోతున్న రష్యన్‌ మహిళలు..వెలుగులోకి కీలక నిజాలు..

12 Feb, 2023 13:28 IST|Sakshi

రష్యాలో గర్భిణీ మహిళలు అర్జెంటీనాకు తరలి వెళ్లిపోతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా చాలా మంది గర్భిణీ మహిళలు తరలి వెళ్లిపోతున్నట్లు సమాచారం. వారంతా అర్జెంటీనా పౌరసత్వం కోసం అక్కడికి వెళ్లి ప్రసవించాలని భావిస్తున్నారట. అదీకూడా ఈ యుద్ధ సమయంలోనే సుమారు 5 వేల మంది దాక రష్యన్‌ గర్భిణీ మహిళలు అర్జెంటీనాకు తరలి వచ్చారని, వారంతా అర్జెంటీనా పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో అర్జెంటీనాకు వస్తున్న రష్యా మహిళల సంఖ్య పెరిగిందని కూడా చెప్పారు. కేవలం ఒక్క గురువారం సుమారు 33 మంది మహిళలు అర్జెంటీనాకు వచ్చినట్లు తెలిపారు. ఐతే వారిలో ముగ్గురు వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. తొలుత రష్యన్‌​ మహిళలు తాము పర్యాటకులుగా అర్జెంటీనాకి వస్తున్నాం అని చెబుతున్నట్లు సమాచారం. అర్జెంటీనా రష్యా కంటే ఎక్కువ స్వేచ్ఛగా ఉండటంతో మాస్కో మహిళలంతా తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం ఉండాలిని భావిస్తున్నట్లు చెప్పారు.

అలాగే అర్జెంటీనా వీసా హోల్డర్స్‌ 171 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు, కానీ రష్యా వీసా కలిగి ఉంటే కేవలం 87 దేశాలు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా అర్జెంటీనా పోలీసులు అరెస్టు చేసిన ఆ ముగ్గురు మహిళల తరుఫు న్యాయవాది తప్పుడు పర్యాటకులు అన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

అదీగాక ఒక రష్యాన్‌​ వెబ్‌సైట్‌ దక్షిణ అమెరికా దేశంలో ప్రసవించాలనుకుంటే తల్లులకు వివిధ ప్యాకేజీలు అందిస్తున్నట్లు అర్జెంటీనా అధికారులు పేర్కొన్నారు. ఇదోక మిలియన్‌ డాలర్ల అక్రమ వ్యాపారమని అధికారులు వెల్లడించారు. ఈ వెబ్‌సైట్‌ రష్యన్‌ మహిళలకు, వారి భాగస్వామ్యులకు అర్జెంటీనాలో స్థిరపడేలా నకిలీ పత్రాలను జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఐతే ఇప్పటి వరకు ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. 

(చదవండి: శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా తన్నుకొచ్చిన ఆనందం)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు