దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్‌! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్‌

3 Mar, 2023 11:02 IST|Sakshi

రష్యా అధ్యక్షుడు ‍వ్లాదిమిర్‌ పుతిన్‌ ఘోర అకృత్యానికి సిద్ధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రష్యా బలగాలు యుద్ధంలో పలు నష్టాలను చవిచూస్తున్నాయి. ఓ పక్క ఆయుధాల  కొరత, మరో వైపు నైపుణ్యవంతులైన బలగాల కొరతతో పోరాడలేక తీవ్రంగా సతమతమవుతోంది. దీంతో ఉక్రెయిన్‌పై గెలుపు కోసం సాముహిక ఆత్మాహుతి దాడులకు రష్యా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఏ క్షణమైనా పుతిన్‌ దీన్ని అదేశించే అవకాశం ఉందని కూడా నివేదిక వెల్లడించింది. ఈ ఉత్తర్వు  రాబోయే మూడు నెలల్లోనే అమలయ్యే అవకాశం లేకపోలేదని నివేదిక స్పష్టం చేసింది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనక తప్పదంటున్నారు. అవి.. రష్యా చర్యల కారణంగా పొరుగున ఉన్న దేశాలు దాడికి దిగే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్‌ పాశ్చాత్య దేశాల ఆయుధాల సాయంతో యుద్ధంలో పురోగతి సాధించడం. పుతిన్‌ యుద్ధంపై విశ్వాసం కోల్పోయి.. మిలటరీ స్దబత ఏర్పడి రష్యా యుద్ధం వీగిపోవచ్చు అని చెబుతున్నారు.

అదీగాక ఈ యుద్ధం ప్రారంభమైన ఒక ఏడాది తరువాత నుంచి రష్యా పెద్ద సంఖ్యలో సైనికులను, యుద్ధ విమానాలను కోల్పోయి పలు నష్టాలను ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పటి వరకు రష్యా దళాలు సంయుక్త దాడిని సమర్థవంతంగా సమన్వయం చేయలేకపోయాయి. గత కొన్ని వారాలుగా ప్రభావంతంగా రష్యన్లు సాముహిక దాడి కొన సాగించలేకపోయారు. పైగా భారీ ఫిరంగి దళాలకు తగిన శిక్షణ లేకపోవండంతో వారికి మిగిలి ఉన్న ఒకే  ఒక్క ఆప్షన్‌ సాముహిక ఆత్మాహుతి పదాతి దళ వ్యూహం. ఇది నిస్సందేహంగా వాయు రక్షణ క్షిపణుల కంటే ప్రాణాంతంకం. 

(చదవండి:  మంటల్లో చిక్కుకున్న 42 అంతస్తుల భవనం..ఒక్కసారిగా వీధుల్లో..)

మరిన్ని వార్తలు