Russia Ukraine War: రష్యాకు మరో షాకిచ్చిన ఉక్రెయిన్‌ సైనికులు

3 Mar, 2022 15:26 IST|Sakshi

ఉక్రెయిన్ నగరాలలో రష్యన్‌ బలగాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనప్పటికీ మారణహోమం మాత్రం ఆగడం లేదు.  రష్యా తరపున సైనికులు, ఉక్రెయిన్‌ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించినా, గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా తీవ్ర నష్టాలను చవి చూస్తున్నట్లు తెలుస్తోంది.  (చదవండి: Russia Ukraine War: ‘భారతీయులు తక్షణమే ఖార్కివ్‌ను వీడండి.. లేదంటే’ )

తాజాగా రష్యాకు మరో గట్టి షాక్‌నిచ్చారు ఉక్రెయిన్‌ సైనికులు. ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తి సామ‌ర్థ్యా లు క‌లిగిన యుద్ధ విమానం సుఖోయ్ (ఎస్‌యూ-30 ఫైట‌ర్ ఎయిర్ క్రాఫ్ట్‌) ర‌ష్యా సైనిక ప‌టాలంలో శత్రు దేశాల‌ను ఇట్టే భ‌య‌పెట్టే ఎయిర్ క్రాఫ్ట్‌. ఈ యుద్ధ విమానాన్ని కూల్చ‌డం అంత ఈజీ కాదు. ర‌ష్యా కంటే సాంకేతిక ప‌రిజ్ఞానంలో మెరుగ్గా ఉంటే త‌ప్పించి అది సాధ్యం కాదు. అయితే చిన్న దేశ‌మైన‌ప్ప‌టికీ ఉక్రెయిన్‌.. త‌న గ‌గ‌న త‌లం మీద‌కు వ‌చ్చిన ర‌ష్యా సుఖోయ్ విమానాన్ని ఒక్క దెబ్బ‌కు కూల్చేసింది. ఈ మేర‌కు ఉక్రెయిన్ సైనిక బ‌ల‌గాల క‌మాండర్ ఇన్ ఛీప్ లెఫ్ట్ నెంట్ జ‌న‌ర‌ల్ వాలేరీ జాలుజ్నియి కాసేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

త‌మ సైనికులు ర‌ష్యా సుఖోయ్‌ను కూల్చ‌డంలో ప‌ర్‌ఫెక్ట్‌గా ప‌నిచేశార‌ని ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మరోవైపు యుద్ధంతో ఏడు లక్షల మంది దేశం విడిచి పారిపోతుండగా.. వాళ్లకు ఆశ్రయం ఇచ్చేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా యుద్ధం ఆపేందుకు ఇరుదేశాలు జరిపిన మొదటి దశ  చర్చలు ఫలించాలేదు. తాజాగా బెలారస్‌ బ్రెస్ట్‌ ప్రాంతంలో చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు