ప్రపంచ శాంతికి ఉమ్మడి సహకారం

19 Mar, 2022 05:00 IST|Sakshi

బైడెన్‌కు జిన్‌పింగ్‌ సూచన

బీజింగ్‌: ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం మనం కోరుకోని సంక్షోభం అని చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ అన్నారు. ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇందుకోసం ఉమ్మడిగా సహకారం అందిద్దామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. ఇరువురు నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో శాంతి సామరస్యం, స్థిరత్వం కనిపించడం లేదని అన్నారు. దేశాలు ఏవైనా సరే యుద్ధ రంగంలో కలుసుకొనే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు