యూఎస్‌కి వార్నింగ్‌ ఇచ్చిన రష్యా! ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యే!

2 Aug, 2022 17:38 IST|Sakshi

Russia On Nancy Pelosi's Taiwan Visit: అగ్రరాజ్యం సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటిస్తున్నారని వస్తున్న వార్తలు పెను వివాదానికి దారితీశాయి. ఒక పక్క తైవాన్‌లో అడుగుపెడితే ఊరుకునేదే లేదంటూ అమెరికాకు పదే పదే చైనా హెచ్చరిస్తోంది. పైగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే మరోవైపు రష్యా కూడా అమెరికా తీరుని తప్పుపట్టింది.

చైనాకి వత్తాసు పలుకుతూ...అమెరికాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఇది ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యని తేల్చి చెప్పారు మాస్కో ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్. యూఎస్‌ సెనెట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ని సందర్శించడం వల్ల చైనాతో యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.

అయినా తైవాన్‌ తమది అని నొక్కి చెబుతూ పదేపదే హెచ్చరించినా... అమెరికా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పైగా వాషింగ్టన్‌ వన్‌  చైనా సూత్రానికి కట్టుబడి ఉంటానంటూ ప్రతిజ్ఞ చేసి మరీ ఇలా యూఎస్‌ పెలోసి తైవాన్‌ పర్యటన ఖరారు చేయడం అంటే బీజింగ్‌కి విరుద్ధంగా వ్యవహరించడమేని నొక్కి చెప్పారు. మరోవైపు ఈ పెలోసీ పర్యటనను సీరియస్‌గా తీసుకున్న చైనా ఇప్పటికే తైవాన్‌కి సంబంధించిన సుమారు 35 ఆహర ఎగుమతులను నిషేధించింది.

(చదవండి: చైనా వార్నింగ్‌తో అలర్ట్‌.. తైవాన్‌ చుట్టూ అమెరికా యుద్ధ నౌకల మోహరింపు)

మరిన్ని వార్తలు