ఇంగ్లండ్‌పై అణు దాడి చేస్తాం.. రష్యా షాకింగ్‌ కామెంట్స్‌

3 May, 2022 06:59 IST|Sakshi

ఇంగ్లండ్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని రష్యా ప్రధాన ప్రచారకర్త ద్మిత్రీ కిసెల్యోవ్‌ హెచ్చరించారు. ‘‘రష్యాపై అణు దాడి చేస్తామని ఇంగ్లండ్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ బెదిరిస్తున్నారు. ఇంగ్లండ్‌పై మేం అణు వార్‌హెడ్‌తో కూడిన పోసిడోన్‌ టోర్పెడోను ప్రయోగిస్తాం. దాని దెబ్బకు రేడియో ధార్మికతతో కూడిన అలలు 1,600 అడుగుల ఎత్తున ఎగసిపడి ఇంగ్లండ్‌ను సమూలంగా, శాశ్వతంగా సముద్రగర్భంలో కలిపేస్తాయి’’ అంటూ ఒక టీవీ షోలో ఆయన బెదిరించారు.

‘‘100 మెగాటన్నుల వార్‌హెడ్‌ సామర్థ్యం పోసిడోన్‌ సొంతం. హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే కొన్ని వేల రెట్లు శక్తిమంతమైనది. దాని దెబ్బకు ఇంగ్లండ్‌ ప్రపంచ పటంలోనే లేకుండా పోతుంది. రాకాసి అలలతో పాటు వచ్చి పడే రేడియో ధార్మికత ఆ దేశాన్ని రేడియో ధార్మిక ఎడారిగా మార్చేస్తుంది. ఇదెలా ఉంది? లేదంటే రష్యా తాజాగా పరీక్షించిన సర్మాట్‌ 2 న్యూక్లియర్‌ మిసైల్‌ను ప్రయోగిస్తాం. ఒక్క దెబ్బకు భస్మీపటలమైపోతుంది. అంత చిన్నది మీ దేశం’’ అంటూ ఎద్దేవా చేశారు. అణు దాడులు తప్పవంటూ రష్యా ప్రభుత్వ మీడియా కొంతకాలంగా ఇంగ్లండ్‌ను హెచ్చరిస్తూ వస్తోంది. కిసెల్యోవ్‌ వ్యాఖ్యలు వాటికి కొనసాగింపేనంటున్నారు.   

ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌ రాజధానికి అమెరికా అధ్యక్షుడు..!

మరిన్ని వార్తలు