ఇదే రిపీట్‌ అయితే.. మా బాంబులు లక్ష్యాన్ని తాకుతాయి: రష్యా

25 Jun, 2021 16:17 IST|Sakshi

మాస్కో: శతాబ్దాల కాలం నుంచి సముద్రాల మీద అధిపత్యం కోసం సంపన్న దేశాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో పలు దేశాలు కొన్ని ప్రాంతాలలోని జలాలు తమకు చెందినవిగా ప్రకటించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరహాలోనే.. తమ జలాల్లోకి ప్రవేశించిన బ్రిటన్‌కు రష్యా గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది. 

వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌ రాయల్‌ నేవికి చెందిన డెస్ట్రాయర్‌ హెచ్‌ఎంఎస్‌ డిఫెండర్‌ నౌక ఉక్రెయిన్‌ నుంచి జార్జియాకు వెళ్లే క్రమంలో క్రిమియా జలాల్లోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన రష్యా నౌకాదళ సిబ్బంది హెచ్చరికగా కాల్పులు జరిపింది. మళ్లీ ఈ ఘటన పునరావృతమైతే మా బాంబులు లక్ష్యాన్ని తాకుతాయని హెచ్చరించింది.  ఇప్పటికే రష్యా.. బ్రిట‌న్ యుద్ధ నౌక త‌మ జ‌లాల్లోకి వ‌చ్చింద‌ని, మాస్కోలోని బ్రిట‌న్ అంబాసిడ‌ర్ కార్యాలయానికి స‌మ‌న్లు కూడా జారీ చేసింది. 

అయితే ఈ జలాలు ఉక్రెయిన్‌కు చెందినవిగా బ్రిట‌న్ స‌హా పలు దేశాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. త‌మ యుద్ధ‌నౌక మార్గంలో ర‌ష్యా బాంబులేసింద‌ని బ్రిట‌న్ ఆరోపిస్తోంది. కాగా ఈ ఘటనపై వీరివురి వాదనలు వేరువేరుగా ఉన్నాయి. ఈ ఘటనపై ర‌ష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రిని బ్రిట‌న్ యుద్ధ‌నౌక మార్గంలో బాంబులేశార‌ట క‌దా అని ప్ర‌శ్నిస్తే.. భ‌విష్య‌త్తులో మార్గంలో కాదు, టార్గెట్‌పైనే వేస్తామ‌ని అన‌డం గ‌మ‌నార్హం. 

చదవండి: ఇదో వింత కేసు, ఇతనికి పది నెలలుగా పాజిటివ్‌..చివరికి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు