అమెరికా తీరుపై రష్యా ఆగ్రహం..!

8 Jun, 2021 14:39 IST|Sakshi

మాస్కో: మానవుడి మేధస్సుతో  శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి అనేక రంగాల్లో విజయాలను ఇప్పటికే జయించాడు.  ఒక అడుగు ముందుకువేసి అంతరిక్షరంగంలో తనదైన ముద్ర వేశాడు. ప్రపంచంలోని అగ్రదేశాలు ఇతర గ్రహాలపై పరిశోధనలను కూడా మొదలుపెట్టాయి.  అంతేకాకుండా అంతరిక్షంలో పాగా వేసేందుకు అగ్రదేశాలు ఇప్పటికే పనులను షురూ చేశాయి. అందులో భాగంగానే చైనా  ఏప్రిల్‌ 29 రోజున తన సొంత స్పేస్‌ స్టేషన్‌ను  ఏర్పాటు చేయడంలో విఫలమైన విషయం తెలిసిందే.  చైనా అవలంభిస్తోన్న స్పేస్‌ కార్యక్రమాలపై ప్రపంచదేశాలు కన్నెర్ర చేశాయి. చైనా తన సొంత స్పేస్‌ స్టేషన్‌ను నిర్మాణం తలపెట్టడానికి ముఖ్యకారణం ప్రస్తుతమున్న  ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో చోటులేకపోవడం.

ఆంక్షలను ఎత్తి వేయండి...!
 ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌పై అమెరికా అవలంభిస్తోన్న తీరుపై రష్యా ఆగ్రహం..! పెదవి విరిచింది. స్పేస్‌ సెక్టార్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికాను హెచ్చరించింది లేకపోతే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి వైదొలుగుతుందని రష్యా తెలిపింది. రష్యా ఐఎస్‌ఎస్‌లో ఆపరేషల్‌ గడువు 2025 కు ముగియనుంది. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోమోస్ అధిపతి డిమిత్రి రోగోజిన్ జెనీవాలో శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ వ్యాఖ్యలను చేశారు.

శిఖరాగ్ర సమావేశంలో  అమెరికా, రష్యా దేశాల అధ్యక్షులు పాల్గొంటారు. జో బైడెన్‌ వైట్ హౌస్ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా ఇరు దేశాధినేతలు సమావేశమవుతున్నారు. అమెరికా స్పేస్‌ రంగంపై విధించిన ఆంక్షలు అంతరిక్ష రంగ అభివృద్ధికి తీవ్ర ఆటంకం కల్గిస్తోందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోమోస్ అధిపతి డిమిత్రి రోగోజిన్ పేర్కొన్నారు.

ఇంటర్నేషనల్‌ స్పేస్ స్టేషన్ ను భూమి నుంచి  200 మైళ్ల దూరంలో యూఎస్, యూరప్, రష్యా దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో యూఎస్‌, రష్యాకు సంబంధించిన  వ్యోమగాములు పాలు పంచుకుంటున్నారు. జెనీవాలో జో బైడెన్‌తో జరిగే శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పేస్‌ రంగంపై అమెరికా విధించిన ఆంక్షలపై చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: చైనా తీరుపై మండిపడ్డ నాసా..!

మరిన్ని వార్తలు