రష్యా జర్నలిస్టుకు పాతికేళ్ల జైలు

18 Apr, 2023 06:21 IST|Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తప్పుబట్టినందుకు వ్లాదిమిర్‌ కారా–ముర్జా జూనియర్‌(41) అనే జర్నలిస్టు, రాజకీయ కార్యకర్త జైలు పాలయ్యాడు. దేశద్రోహం నేరకింద రష్యా కోర్టు ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

సైనిక చర్యను బహిరంగంగా విమర్శిస్తున్న ఆయనపై ఇప్పటికే రెండుసార్లు విషప్రయోగం జరిగింది. జైలుశిక్షను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి.

మరిన్ని వార్తలు