రష్యన్‌ డ్రోన్‌ విధ్వంసం: వైరల్‌ వీడియో

5 Mar, 2022 10:28 IST|Sakshi

Video Footage Of The Drone Strike: ఉక్రెయిన్‌ పై రష్యా భూ, వాయు, జల మార్గాలలో నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. ఈ క్రమంలో రష్యా అత్యాధునిక డ్రోన్‌ టెక్నాలజీతో కూడా మరోవైపు నుంచి దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఒక రష్యన్‌ డ్రోన్‌ ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్‌లోని ఐదార్ బెటాలియన్ కమాండ్, అబ్జర్వేషన్ పోస్ట్‌ను ధ్వంసం చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

అంతేకాదు డ్రోన్ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఓరియన్‌ డ్రోన్‌(ఇనోఖోడెట్స్‌  అని కూడా పిలుస్తారు) అనేది క్రోన్‌ష్‌టాడ్ట్‌  అభివృద్ధిపరిచిన అత్యాధునిక డ్రోన్‌. ఈ డ్రోన్‌ విమానం మాదిరి ఒక మోస్తారు ఎత్తులో ఉండి క్షిపణులతో దాడులు చేస్తోంది. అంతేకాదు ఈ డ్రోన్‌కి సుమారు నాలుగు క్షిపణులను మోసుకెళ్లగల సామర్థ్యం గలదు. పైగా 24 గంటల పాటు గాలిలో ఉండగలదు. ఈ మేరకు ఈ డ్రోన్‌ విధ్వంసానికి సంబంధించి వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: జెలెన్‌ స్కీకి హ్యాండ్‌ ఇచ్చిన నాటో.. ఉక్రెయిన్‌ అభ్యర్థన తిరస్కరణ)

మరిన్ని వార్తలు