ఫాస్ట్‌ ఫుడ్‌ కోసం హెలికాప్టర్‌లో 725 కిమీ..

3 Dec, 2020 14:38 IST|Sakshi

మాకావ్‌: ఫాస్ట్‌ ఫుడ్‌ అంటే ఇష్టముండని వారంటుండరు. సామాన్యూలు నుంచి ధనికులకు వరకు ఫాస్ట్‌ ఫుడ్‌ అంటే చేవి కోసుకుంటారు. అలాంటి ఫాస్ట్‌ ప్రియులంతా లాక్‌డౌన్‌ నిబంధనలను‌ సైతం పక్కన పెట్టి సాహాసాలు చేసిన సందర్భాలు వెలుగు చుస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా సమీప ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లు తెరుచుకోకపోవడంతో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి తనకు ఇష్టమైన బట్టర్‌ చికెన్‌ వెతుక్కుంటూ యూకె బార్డర్‌కు వెళ్లి వచ్చిన సంఘటన సోషల్‌ మీడియాలో ఇటీవల వైరల్‌ అయింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆ డ్రైవర్‌ తన ఇంటి నుంచి దాదాపు 32 కిమీ దూరంలో ఉన్న మెయిన్‌ సిటీకి ప్రయాణించాడు. యుకేలోని ఓ డ్రైవర్‌ పిజ్జా కోసం లాక్‌డౌన్‌ నిబంధనలు విస్మరిస్తూ.. గంటకు  72 కిమీ వేగంతో వెళ్లి కొనుగోలు చేశాడు. ఇటీవల జరిగిన ఈ రెండు సంఘటనలు అందరిని ఆశ్చర్యపరచగా... తాజా ఈ ఫాస్ట్‌ ఫుడ్‌ కోసం రష్యా బిలియర్‌ ఏం చేశాడో తెలిస్తే నోళ్లు వెల్లబెట్టాల్సిందే.

రష్యాకు చెందిన విక్టోర్‌​ మార్టినవ్‌‌(33) బిలియనీర్‌ తనకు ఇష్టమైన మెక్‌డోనాల్డ్స్‌ ఫెంచ్‌ ప్రైస్‌, బర్గర్‌ కోసం 720కిమీ హెలికాప్టర్‌లో ప్రయాణించి దాదాపు 2,680 డాలర్లు ఖర్చు పెట్టాడు. క్రస్‌నోర్‌ సమీపంలో మెయిన్‌ సిటీలో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌కు అతడు తన చాటెడ్‌ హెలికాప్టర్‌లో 450 మైళ్లు ‍ప్రయాణించి పెద్ద పెద్ద మకావ్‌ ప్యాకెట్స్‌, మిల్క్‌ షేక్స్‌, ఫ్రెంచ్‌ ప్రైస్‌, బర్గర్‌లు కొనుగొలు చేశాడు. అయితే అక్కడ హెలికాప్టర్‌ నిలిపెందుకు స్థలం లేనప్పటికి అతడు క్రస్‌నోర్‌కు కాస్తా దూరంలో హెలికాప్టర్‌ను నిలిపి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి మరి ఇష్టమైన ఫెంచ్‌ ప్రైస్‌, మిల్క్‌ షేక్‌, తెచ్చుకున్నాడంట. ఇక దీనిపై మార్టినవ్‌ మాట్లాడుతూ.. ‘నా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఆలుస్తాకు హాలీడే ట్రిప్‌కు వచ్చాను. ఆలుస్తాలోని బ్లాక్‌ సీ సమీపంలో ఓ రిసార్ట్‌లో దిగాం. రిసార్ట్‌లో పెట్టె సాధారణ మాకావ్‌ ఫుడ్‌ తిని విసిగిపోయాం. దీంతో హెలికాప్టర్‌లో క్రస్‌నోర్‌లో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌కు వెళ్లి మాకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకుని వచ్చాం’ అని ఆయన‌ చెప్పుకొచ్చాడు.  

మరిన్ని వార్తలు