War In Ukraine: సొంత దేశంలోనే వెల్లువెత్తుతున్న వ్యతిరేకత... సందిగ్ధ స్థితిలో పుతిన్‌

14 Mar, 2022 15:26 IST|Sakshi

A video of the pilot’s message: ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న భీకరమైన పోరు నేటికి 19వ రోజుకు చేరుకుంది. ఒకవైపు ఉక్రెయిన్‌ లొంగిపోమని రష్యా చెబుతున్న తలవంచేదే లేదంటూ యుద్ధం చేస్తోంది. దీంతో రష్యా వైమానిక క్షిపణి దాడులతో బాంబుల వర‍్షం కురిపించి ఉక్రెయిన్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ విధ్వంస సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలు సైతం హెచ్చరికలు, ఆంక్షలు జారీ చేసిన తనదైన యుద్ధ వ్యూహంతో చెలరేగిపోతుంది.

రష్యా సృష్టించి విధ్వంసకర పోరులో వేలాదిమంది ఉక్రెయిన్‌ పౌరులను పొట్టన పెట్టుకుంది. మహిళలు, పిల్లలు, ఆస్పత్రుల పై దాడులు జరిపి రాక్షస విధ్వంసానికి బీజం వేసింది. దీంతో రష్యా దేశంలోని ప్రజలే ఆ దేశ అధ్యక్షుడి వ్యవహార తీరుపై ఆగ్రహం చెందడమే కాక నిరసనలు చేశారు. అయినప్పటికీ పుతిన్‌ తన పంథా మార్చుకోకపోగ సరికొత్త వ్యూహాలతో ఉక్రెయిన్‌ని దురాక్రమణ చేసేందుకు పావులను కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాలోని ఒక పైలెట్‌ ఉక్రెయిన్‌పై యుద్ధం నేరమని, దీనిని ఆపేందుకు వివేకవంతమైన పౌరులు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చాడు.

ఈ మేరకు అతను విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు తెలివైన పౌరులు తనతో ఏకీభవించడమే కాక ఆపేందుకు తమవంతుగా కృషిచేస్తారని భావిస్తున్నా అని అన్నాడు. అంతేకాదు ప్రయాణికులకు కూడా చప్పట్లతో తమ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఉక్రేనియన్ దౌత్యవేత్త ఒలెగ్జాండర్ షెర్బా మాట్లాడుతూ.. "పైలట్ రష్యాకు చెందిన ఫ్లాగ్ ఎయిర్‌లైన్ ఏరోఫ్లాట్‌ అనుబంధ సంస్థ అయిన పోబెడా కోసం పనిచేస్తున్న పైలట్ సాయర్‌ . అతను టర్కీలోని అంటాల్యకి చేరుకుంటున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశాడు." అని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: మాటలు జాగ్రత్త! తేడా వస్తే అంతే.. ఇలా వచ్చి అలా తలపై కోడిగుడ్డుతో...)

మరిన్ని వార్తలు