Afghanistan: అమెరికా సాధించింది శూన్యం, పుతిన్‌ సెటైర్లు

2 Sep, 2021 13:31 IST|Sakshi

మాస్కో: అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్ల పాటు యుద్ధం చేసిన అమెరికా చివరకు సాధించింది శూన్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. అఫ్గాన్‌లో అమెరికా చర్యలు, కార్యకలాపాలను ఆయన తప్పుపట్టారు. అఫ్గాన్‌ ప్రజలకు నాగరికత నేర్పేందుకు, సంస్కరించేందుకు అమెరికా సైన్యం 20 సంవత్సరాలపాటు ప్రయత్నించిందని. సొంత నియమాలు, జీవన ప్రమాణాలను ప్రవేశపెట్టాలని చూసిందని చెప్పారు. చివరకు విషాదం, నష్టం మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. అనుకున్న ఫలితం రాలేదన్నారు.

చదవండి : Siddharth Shukla: దిగ్ర్భాంతిలో బాలీవుడ్‌, టీవీ ఇండస్ట్రీ

20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధం వల్ల అమెరికా కంటే అఫ్గాన్‌ ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లిందని పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఒకరిపై బయటి నుంచి ఏదో రుద్దడం అసాధ్యమని తేల్చిచెప్పారు. ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే ముందుగా వారి చరిత్రను సమగ్రంగా తెలుసుకోవాలని, వారి సంస్కృతిని అలవర్చుకోవాలని, సంప్రదాయాలను గౌరవించాలని వెల్లడించారు.

చదవండి :  Afghanistan Crisis: కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్‌.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు?

మరిన్ని వార్తలు