మరోసారి ఆక్రమిత ఉక్రెయిన్‌లోకి పుతిన్‌

19 Apr, 2023 05:44 IST|Sakshi

కీవ్‌: యుద్ధం మొదలై దాదాపు 13 నెలలు పూర్తవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సోమవారం ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పర్యటించి తమ సైన్యం సన్నద్ధతను సమీక్షించారు. మొదట ఖేర్సన్‌ ప్రావిన్స్‌కు చేరుకున్న పుతిన్‌ అక్కడి రష్యా సేనల కమాండ్‌ పోస్ట్‌కు వెళ్లారు. తర్వాత లుహాన్సŠక్‌లోని రష్యన్‌ నేషనల్‌ గార్డ్‌ ప్రధాన కార్యాలయానికి వచ్చారు.

ఖేర్సన్, లుహాన్సŠక్‌లో సైనిక ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. రష్యా అధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో పుతిన్‌ పర్యటించడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. కొన్ని నెలల క్రితమే ఆక్రమించాక ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, లుహాన్సŠక్, డోనెట్స్కŠ, జపోరిజియా ప్రావిన్స్‌లను స్థానిక ‘రెఫరెండమ్‌’ల ద్వారా గత సెప్టెంబర్‌లో రష్యా తనలో కలిపేసుకున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు